`శంభో శంక‌ర` పక్కా కమర్షియల్ బ్లాక్ బస్టర్ హిట్ !

షకలక శంకర్, కారుణ్య హీరో హీరోయిన్స్ గా పరిచయం చేస్తూ ఆర్. ఆర్. పిక్చ‌ర్స్ సంస్థ, ఎస్.కె. పిక్చ‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో వై. ర‌మ‌ణారెడ్డి, సురేష్ కొండేటి సంయుక్తంగా నిర్మించిన చిత్రం`శంభో శంక‌ర`. ఇటీవలే విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షలు నీరాజనాలు పడుతూ..  బ్లాక్ బస్టర్ హిట్ ను అందించారు.. ఈ సందర్భంగా ఆదివారం  ఉదయం ప్రసాద్ ల్యాబ్ లో  గ్రాండ్ సక్సెస్ వేడుకను నిర్వహించారు చిత్ర యూనిట్.
ఈ సందర్భంగా   ఏడిద శ్రీరామ్ మాట్లాడుతూ… సినిమా చేస్తున్నప్పుడు సినిమా చేస్తున్నప్పుడే నమ్మకముండేది చిన్న సినిమా హిట్ అయితేనే పరిశ్రమ బాగుంటుంది అలానే ఆర్టిస్టులకు ఫ్యూచర్ ఉంటుంది అని అన్నారు.
ఆర్టిస్ట్ ప్రభు మాట్లాడుతూ…  ఆదరించిన వారందరికీ చాలా థ్యాంక్స్. ఇంత  పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు ఇప్పుడు  చాలా ఆనందంగా ఉంది అన్నారు.
నాగినీడు మాట్లాడుతూ… పూర్తి స్వేచ్ఛ ఇచ్చి వర్క్ చేయించుకున్నారు డైరెక్టర్ కు ఏం కావాలో లిబర్టీ ఉంటే అవుట్పుట్ బాగా వస్తుందని ఈ సినిమా నిరూపించింది.
లిరిక్ రైటర్ మాట్లాడుతూ… పాటలు రాయడానికి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్ నన్ను ప్రోత్సహించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు.
చిత్ర డైరెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ… శంకర్ నేను ఈ సినిమా కోసం ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపాము ఎంతో తపనతో సినిమా ను తెరకెక్కించాము. ఈ ప్రాజెక్టుపై నమ్మకము ఉన్న ఎక్కడో చిన్న భయం ఉండేది కానీ ఈ సినిమా హిట్ తో ఆ భయం పోయింది. మాతోపాటు సురేష్ కొండేటి, రమణారెడ్డి గారు ఇద్దరూ సినిమాకోసం కష్టపడ్డారు.. పోస్టర్ డిజైన్ లు బాగున్నాయి అంటే అది సురేష్ కొండేటి గారి కష్టమే. టెక్నీషియన్స్ అందరూ.. ఎంతో కష్టపడి సహకరించారు.  వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మ్యూజిక్ అందించిన సాయి కార్తీక్ గారికి రుణపడి ఉంటాను.  ముఖ్యంగా సినిమా ను ఆదరించిన  ప్రేక్షకులందరికీ  నా కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాను అన్నారు.
సురేష్ కొండేటి మాట్లాడుతూ… ఎంకరేజ్ చేసిన వారందరికీ కృతజ్ఞతలు. 10 కోట్లు బడ్జెట్ పెట్టి చేయాల్సిన సినిమాను అతి తక్కువ  బడ్జెట్లో పది రూపాయలకు ఒక రూపాయి మాత్రమే తీసుకుని సినిమా బాగా రావాలని  వర్క్ చేశారు. డబ్బులు పెట్టిన ప్రతి డిస్ట్రిబ్యూటర్ కు డబ్బులు వచ్చాయి. పక్క కమర్షియల్ బ్లాక్ బస్టర్ హిట్ అని ఖచ్చితంగా చెప్పగలను. నేను జర్నలిస్టుగా ఉన్నప్పటినుంచి శివాజీ రాజా గారితో కలిసి తిరిగాను. ఆయన మంచితనాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను. ‘మా’ కు ఆయన చేస్తున్న సేవ ఎనలేనిదని చెప్పచ్చు. నా వంతు సహకారాన్ని అందించాలని ఉద్దేశంతో శంభో శంకర సినిమా ద్వారా వచ్చిన కొంత అమౌంట్ ను పదివేల రూపాయల చొప్పున పది మంది నిరుపేదలకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నా ము. ఇక సినిమా ను ఆదరించిన ప్రతి ప్రేక్షకునికి నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. నిర్మాత రమణారెడ్డి, శ్రీధర్, శంకర్ ల కష్టమే.. ఇప్పుడు ఈ విజయం అని చెప్పారు.
హీరో శంకర్ మాట్లాడుతూ… నన్ను ప్రోత్సహించిన వారందరికీ కృతజ్ఞతలు. మీ ఎంకరేజ్మెంట్ అంటే సక్సస్ అవుతానని ఆశిస్తున్నాను. ఈ సినిమా ద్వారా ముందుగా ఆడియన్స్ హ్యాపీగా ఉన్నారు. థియేటర్లో ఉన్నప్పుడే నాకు కాల్ చేసి అభినందిస్తున్నారు. మా కష్టం ఫలించింది. నేను శ్రీధర్ ప్రేమించుకునే సినిమా చేశాము. రమణారెడ్డి, సురేష్ కొండేటి కష్టం వలనే ఈ సినిమా హిట్ టాక్
తెచ్చుకుంది. మా దృష్టిలో వీరిద్దరే దేవుళ్ళు. పెద్ద హీరో సినిమాను చూస్తే ఆడియన్స్ ఎలా ఫీలవుతారు అలా ఉండాలని ఈ సినిమాను చేసాము. ఇకపై కూడా ఇదేవిధంగా నిజాయితీగా నమ్మకంగా  సినిమాలు చేస్తామని మాటిస్తున్నాను అని చెప్పారు.
ఈ చిత్ర హీరోయిన్ కారుణ్య మాట్లాడుతూ… అవకాశమిచ్చినందుకు దర్శకనిర్మాతలకు హీరో శంకర్కు నా కృతజ్ఞతలు. అలానే ఈ సినిమా ను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అంటూ తెలిపారు.