ఆమె అంటే హీరోలకెప్పుడూ భయమే !

షకీలా బయోపిక్… ప్రస్తుతం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ బయోపిక్‌ను సౌత్‌లో కూడా డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. షకీలా పాత్రను బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా పోషిస్తోంది. షకీలా జీవితంలోని కీలక పరిణామాలు, ఆమె కెరీర్ సాగిన తీరు, ఆమె పతనం అన్నింటినీ కూడా ఈ చిత్రంలో చక్కగా చూపించేందుకు దర్శకుడు ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఇక షకీలా బి గ్రేడ్ సినిమాలతో చాలా బిజీగా ఉన్న సమయంలో ఆమెను తొక్కేసేందుకు మలయాళ స్టార్ హీరోలు కొందరు చాలా ప్రయత్నాలు చేశారట. షకీలా  మొదట్లో చేసిన మలయాళ చిత్రాల ధాటికి పెద్ద హీరోల చిత్రాలు డీలా పడేవి.అందుకని ఆమె సినిమాల విడుదలకు అనేక అడ్డంకులను వారు సృష్టించేవారట. షకీలా సినిమాలను బ్యాన్ చేయాలంటూ మలయాళ స్టార్ హీరోలు కొందరు వత్తిడి తీసుకువచ్చేవారట. ఇప్పుడు షకీలా బయోపిక్‌లో వీటన్నింటినీ కూడా చూపించబోతున్నట్లుగా చెబుతున్నారు. షకీలాను తొక్కేసేందుకు స్టార్స్ చేసిన ప్రయత్నాలను ఈ చిత్రంలో ప్రముఖంగా చూపించబోతున్నారట.అందుకని  మలయాళ స్టార్ హీరోలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. షకీలా మూవీలో తమ గురించి ఎలాంటి బాంబులు పేల్చనున్నారోనని వారు ఆందోళన చెందుతున్నారు. తమ గురించి తప్పుగా చూపిస్తే ఆ సినిమాపై న్యాయపోరాటానికి కూడా ఆ స్టార్ హీరోలు సిద్ధమయ్యే అవకాశం ఉందని మలయాళ సినీ వర్గాల వారు అంటున్నారు.