బ‌యోపిక్‌లో ష‌కీలా కీల‌క పాత్ర

షకీలా బ‌యోపిక్… సాధార‌ణ యువ‌తి స్థాయి నుండి అత్యున్న‌త స్థాయికి ఎదిగిన అడ‌ల్ట్ స్టార్ ష‌కీలా. ఒక‌ప్పుడు త‌న సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించిన శృంగార తార ష‌కీలా 250 సినిమాలలో న‌టించింది. టాప్ హీరోల‌కి స‌మానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ భామపై ప్ర‌స్తుతం బ‌యోపిక్ తెర‌కెక్కుతుంది. ఇంద్ర‌జిత్ లంకేశ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రిచా చద్దా లీడ్ రోల్ పోషిస్తోంది. ఆ మ‌ధ్య ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. కేర‌ళ సంప్ర‌దాయం ప్ర‌కారం క‌స‌వ ప‌ట్టు చీర‌లో ద‌ర్శ‌న‌మిచ్చిన రిచా త‌న లుక్‌తో ఆక‌ట్టుకుంది. ష‌కీలా బ‌యోపిక్‌లో న‌టిస్తున్న రిచా స్వ‌యంగా ఆమెని క‌లిసి ఎన్నో విషయాల‌ని అడిగి తెలుసుకుంది… “ష‌కీలా పాత్ర‌లో న‌టించ‌డం ఓ చాలెంజ్‌. జీవితంలో ఎన్నో మ‌లుపులున్నాయి. మాములు స్థాయి నుండి టాప్ స్టార్ గా ఎదిగిన ఆమె పాత్ర‌ని పోషించ‌డం ఓ ఛాలెంజ్‌. ఆమె పాత్ర‌కి న్యాయం చేస్తానని భావిస్తున్నాను” అంటూ రిచా తెలిపింది
 
షకీలా వ్యక్తిగత జీవితం, సినీరంగం ప్రవేశం, కెరీర్‌లోని కష్టాలను వెండితెర మీద ఆవిష్కరించ‌నుండ‌గా, ద‌ర్శ‌కుడు ఇంద్ర‌జిత్.. ష‌కీలా అడ‌ల్ట్ స్టార్‌గా మార‌డానికి గ‌ల కార‌ణాల‌ని వెండితెర‌పై అత్యంత ఆస‌క్తిక‌రంగా చూపించ‌నున్నాడ‌ట‌. అయితే ఈ చిత్రంలో ష‌కీలా కూడా ముఖ్య పాత్ర‌లో న‌టిస్తే బాగుంటుంద‌నే త‌న కోరిక‌ని ద‌ర్శ‌కుడు ష‌కీలాతో చెప్తే… ఆమె వెంట‌నే ఓకే చెప్పేసిందట‌. ష‌కీలా నిజ‌మైన సూప‌ర్‌స్టార్ అని, ఆమె జీవితంలో ఎదుర్కొన్న క‌ష్టాల‌ను, సినీ రంగంలో ఎదుర్కొన్న స‌మ‌స్య‌ల‌ను ఈ సినిమాలో చూపించ‌బోతున్నామ‌ని ద‌ర్శ‌కుడు తెలిపాడు.మలయాళ నటుడు రాజీవ్‌ పిళ్లై ఈ సినిమాలో షకీలా ప్రేమికుడు అర్జున్ అనే పాత్ర‌లో కనిపించనున్నారు. సిల్క్ స్మిత జీవిత‌చ‌రిత్ర ఆధారంగా రూపొందిన ‘డ‌ర్జీ పిక్చ‌ర్’ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డంతో తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల‌లో న‌టించిన ష‌కీలా బ‌యోపిక్ కూడా మంచి విజయాన్ని సాధిస్తుందని నిర్మాతలు ఆశిస్తున్నారు .