శంత‌న్ భాగ్య‌రాజ్ `ల‌వ్‌గేమ్` ప్రీ- రిలీజ్ ఈవెంట్‌ !

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు భాగ్య‌రాజ్ త‌న‌యుడు శంత‌న్ భాగ్య‌రాజ్, సృష్టి డాంగే జంట‌గా త‌మిళంలో రూపొందిన చిత్రం `ముప్ప‌రి మ‌నమ్‌`. త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన ఈ చిత్రం రైట్స్ ఫ్యాన్సీ రేటుతో ద‌క్కించుకున్న భువ‌న్ కుమార్ అల్లం, ధను క్రియేష‌న్స్ బేన‌ర్ పై `ల‌వ్ గేమ్` పేరుతో తెలుగులోకి అనువ‌దిస్తున్నారు. ఆది రూప‌న్ ద‌ర్శ‌కుడు. ఇటీవ‌లే సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మార్చి 8న గ్రాండ్ గా విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ మార్చి 2న హైద‌రాబాద్‌లో జ‌రిపారు.
 
ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా వి చ్చేసిన అనిల్‌రావిపూడి మాట్లాడుతూ… “భాగ్య‌రాజ్‌గారు నా `ఎఫ్‌2` చిత్రం చూసి ప్ర‌తీ డైలాగ్ గుర్తుంచుకొని నాకు ఫోన్ చేసి మ‌రీ ప్ర‌శంసించారు. కుటుంబ క‌థా చిత్రాలు చేయ‌డంలో భాగ్య‌రాజ్‌గారి త‌ర్వాతే ఎవ‌రైనా. నేను ఆయ‌న‌కు పెద్ద ఫ్యాన్ ని. ఆయ‌న‌తో నేను ఈ ఫంక్ష‌న్ కు హాజ‌రుకావ‌డం అదృష్టంగా భావిస్తున్నా“ అన్నారు.
డైర‌క్ట‌ర్ క‌రుణాక‌ర‌న్ మాట్లాడుతూ… “ నేను భాగ్య‌రాజ్ గారికి పెద్ద ఫ్యాన్ ని . వారి త‌న‌యుడు తమిళంలో న‌టించిన ఈ సినిమా తెలుగులో `ల‌వ్ గేమ్ ` పేరుతో వ‌స్తోంది. ఇక్క‌డ బాగా ఆడాల‌ని కోరుకుంటున్నా“ అన్నారు.
డైర‌క్ట‌ర్ చంద్ర‌మ‌హేష్ మాట్లాడుతూ… “ముందుగా ఈ `ల‌వ్‌గేమ్` ప్రొడ్యూస‌ర్‌కి నా శుభాకాంక్ష‌లు. నేను భాగ్య‌రాజ్‌గారికి ఏక‌ల‌వ్య‌శిష్యుణ్ని. సెంథిల్ చాలా అద్భుత‌మైన ఆర్టిస్ట్. ఈ చిత్రం త‌ప్ప‌కుండా మంచి హిట్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.
హీరో శంత‌న్ భాగ్య‌రాజ్ మాట్లాడుతూ…“ 30ఏళ్ళ నుంచి మా నాన్న‌గారిని ఆద‌రిస్తున్నారు. అదే ఆద‌ర‌ణ నాకు కూడా ఇవ్వాల‌ని కోరుకుంటున్నాను. ఈ సినిమా ద్వారా తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం అవుతున్నాను. ఈ సినిమాలో ఒక మంచి పాయింట్ ఉంటుంది. అది అంద‌రికీ అనెక్ట్ అవుతుంది“ అన్నారు.
ప్రొడ్యూస‌ర్ భువ‌న్ కుమార్ అల్లం మాట్లాడుతూ… “ నేను 20 సినిమాలు చూశాను. అందులో ఈ సినిమా బాగా న‌చ్చింది. వెంట‌నే రైట‌ర్ వెన్నెల‌కంటిగారిని చూడ‌మ‌న్నా… ఆయ‌న ఈ సినిమాని ఎంతో మెచ్చుకున్నారు. మీరు ఈ సినిమాకి నాకు డ‌బ్బులు ఇవ్వ‌క‌పోయినా ప‌ర్వాలేదు నేను వ‌ర్క్ చేస్తాను అన్నారు. దాంతో నాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది. ఈ సినిమా త‌ప్ప‌కుండా తెలుగులో కూడా పెద్ద హిట్ అవుతుంద‌ని న‌మ్ముతున్నా“ అన్నారు.
న‌టుడు భాగ్య‌రాజ్ మాట్లాడుతూ…“మా అబ్బాయి న‌టించిన త‌మిళ చిత్రం తెలుగులో `ల‌వ్ గేమ్` పేరుతో తెలుగులో కి విడుద‌ల‌వుతోంది. డెఫ్‌నెట్‌గా ఇక్క‌డ కూడా హిట్ అవుతుంద‌ని న‌మ్ముతున్నా. నా డబ్బింగ్ చిత్రాల‌న్నీ ఇక్క‌డ సూప‌ర్‌హిట్లు అయ్యాయి. మరి ఇప్పుడు ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కులు రిసీవ్ చేసుకుంటార‌ని నమ్ముతున్నా“ అన్నారు.
న‌టి ర‌మ్య‌కృష్ణ మాట్లాడుతూ… “భాగ్య‌రాజ్ గారు ఇండియాలోనే జీనియ‌స్ డైరెక్ట‌ర్‌. ఆది రూప‌న్ ప్ర‌స్తుతం ఉన్న యంగ్ జ‌న‌రేష‌న్‌లో చాలా టాలెంటెడ్ డైర‌క్ట‌ర్ . ఈ చిత్రం తెలుగులో కూడా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.
డైర‌క్ట‌ర్ తేజ మాట్లాడుతూ… “నేను భాగ్య‌రాజ్‌గారికి పెద్ద ఫ్యాన్‌ని. నేను చ‌దువుకునే రోజుల్లో ఆయ‌న సినిమాల‌న్నీ చూసేవాడ్ని. వాళ్ళ అబ్బాయి సినిమా ఇక్కడ రిలీజ్ అయి పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.
హీరో రాజశేఖ‌ర్ మాట్లాడుతూ… “భాగ్య‌రాజ్‌గారు చాలా మంచి స్క్రీన్ ప్లే డైరెక్ట‌ర్‌. వాళ్ళ అబ్బాయి అంటే ప్ర‌త్యేకించి చెప్ప‌క్క‌ర్లేదు . వారి స్థాయిలో క‌చ్చితంగా గొప్ప పేరు తెచ్చుకుంటాడు. త‌ప్ప‌కుండా` ల‌వ్‌గేమ్` తెలుగులో పెద్ద హిట్ అవుతుంది“ అన్నారు.
న‌టి జీవిత రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ… “తేజ నేను క్లాస్‌మేట్స్ …త‌ను ఎలా భాగ్య‌రాజు గారి మూవీస్ చూసి ఇష్ట‌ప‌డ్డాడో నేను అంతే. మేము వాళ్ళ అబ్బాయి ఫంక్ష‌న్‌కి రావ‌డం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్ర యూనిట్ అంద‌రికీ మా స్పెష‌ల్ విషెస్“ అన్నారు.
హీరో సందీప్ కిష‌న్ మాట్లాడుతూ… “భాగ్య‌రాజ్‌గారు చాలా పెద్ద వారు. వాళ్ళ అబ్బాయి శంత‌న్ భాగ్యరాజ్ నాకు మంచి ఫ్రెండ్. ఎదుటి వాళ్ళ‌కి ఎంతో హెల్ప్ చేసే గుణ‌ముంది. చాలా త‌క్కువ స‌మ‌యంలోనే త‌ను నాకు చాలా స‌హాయ‌ప‌డ్డాడు. ఈ సినిమా స‌క్సెస్ కావాల‌ని మ‌న‌సారా కోరుకుంటున్నాను అన్నారు.