సల్మాన్ ‘ట్యూబ్ లైట్’ లో షారుఖ్

సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘ట్యూబ్ లైట్’. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమా నిర్మాత, నటుడు సోహైల్ ఖాన్, సినిమా విశేషాలను అభిమానులతో పంచుకున్నాడు. తన అభిమాన దర్శకుడైన కబీర్ ఖాన్ తో కలిసి పనిచేయటం చాలా ఆనందంగా ఉందన్నాడు. అదే సమయంలో ఆసక్తికరమైన విషయమొకటి వెల్లడించాడు…..

సల్మాన్  హీరో గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ టాప్ హీరో షారూఖ్ ఖాన్ కీలకమైన అతిథి పాత్రలో కనిపిస్తున్నాడట. కథను మలుపు తిప్పే ముఖ్యమైన క్యారెక్టర్  షారుఖ్ చేసినట్లు వెల్లడించాడు సోహైల్. అంతేకాదు ఆ పాత్రకు షారూఖ్ ఇమేజ్ చాలా హెల్ప్ అవుతుందని… అందుకే షారూఖ్ ను ఆ పాత్రకు ఒప్పించినట్టుగా తెలిపాడు.