ఆ సినిమా స్టార్ట్ అయ్యాక పర్సనల్ జెట్ తీసుకుంటా !

షారూక్ ఖాన్‌ పెద్ద స్టార్ హీరోకు వ్యక్తిగత జెట్ ఫ్లైట్ ఉండకపోవడమేంటి? అని చాలా మంది అభిమానులు చర్చించుకునే ప్రశ్న. కానీ, దానికి షారూక్ నుంచి వచ్చిన సమాధానం… ఇప్పటిదాకా వ్యక్తిగత జెట్ లేదు కానీ.. తీసుకునేందుకు మాత్రం ప్రయత్నాలు ప్రారంభించానని చెప్పారు. ప్రస్తుతం వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ఓ సినిమా చేయబోతున్నానని, ఆ సినిమా స్టార్ట్  అయ్యాక పర్సనల్ జెట్ తీసుకుంటానని చెప్పారు. అంతేకాదు.. ఇప్పటిదాకా తాను ఏ టాటూలూ వేయించుకోలేదని, “జబ్ హారీ మెట్ సెజాల్” సినిమా కోసం కుడి భుజం, ఛాతి మీద తాత్కాలిక టాటూలు వేయించుకున్నానని చెప్పారు. టాటూలంటే తనకు చచ్చేంత భయమని వెల్లడించారు.
ఇటీవల వరుస వైఫల్యాలు ఎదురవుతున్నా.. అతడి ఫాలోయింగ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. వయసు మీద పడుతున్నా ఇప్పటికీ కుర్రాడిలా కనిపించడం షారూక్ ప్రత్యేకత. తన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని అనుకునే బాలీవుడ్ అభిమానులు ఎంతో మంది. వాటన్నిటికీ గూగుల్ సరైన ఆన్సర్ ఇచ్చిందో లేదో తెలియదు కానీ.. షారూక్ మాత్రం చెప్పేశారు. తన ఫోన్ నంబర్‌తో సహా వ్యక్తిగత విషయాలను ఓ జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
    ఇక, తన వ్యక్తిగత ఫోన్ నంబర్‌ను వెల్లడించారు షారూక్. ‘‘5559960321.. ఇదే నా ఫోన్ నంబర్. అర్ధరాత్రి తర్వాత ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. నేను తప్పకుండా ఫోన్ ఎత్తుతాను. ఎత్తలేని పరిస్థితులుంటే.. ఓ మెసేజ్ పెట్టండి. ఓ ఎమోజీతో నేను కూడా రిప్లై ఇస్తాను’’ అంటూ సమాధానమిచ్చారు.  తన అసలు పేరు కూడా షారూక్ ఖాన్ అనే చెప్పుకొచ్చారు. తనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు అదేనని చెప్పారు.