హాలీవుడ్ స్టార్స్ ని దాటేసిన షారుఖ్ ఖాన్

ఇటీవల చెప్పుకోదగ్గ విజయాలు లేనిబాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ రికార్డుల ప‌రంప‌ర కొన‌సాగుతూ పోతోంది . వైవిధ్య‌మైన సినిమాల‌తో అశేష ఆద‌ర‌ణ‌ని చూర‌గొన్న షారూఖ్ ఖాన్ ప్ర‌స్తుతం ఆనంద్ ఎల్ రాయ్ ద‌ర్శ‌క‌త్వంలో ‘జీరో’ అనే సినిమా చేస్తున్నాడు. క‌త్రినా కైఫ్‌, అనుష్క శ‌ర్మ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ సినిమాలో స‌ల్మాన్ ఖాన్‌, దీపిక ప‌దుకొణే, శ్రీదేవి, రాణి ముఖ‌ర్జీ,కాజోల్‌, అలియా భ‌ట్, క‌రీష్మా క‌పూర్‌, జూహీ చావ్లా స్పెష‌ల్ అప్పీయ‌రెన్స్ ఇవ్వ‌నున్నారు. డిసెంబ‌ర్ 21న ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ‘జీరో’ మూవీలో షారూఖ్ మ‌రుగుజ్జుగా క‌నిపిస్తూ ప్రేక్ష‌కుల‌కి ప‌సందైన విందు అందించ‌నున్నాడు.

అయితే త‌న కెరీర్‌లో ఎన్నో రికార్డులు సాధించిన కింగ్ ఖాన్ ఇప్పుడు మ‌రో ఫీట్ సాధించి అభిమానుల‌ని మ‌రింత సంతోషింప‌జేశాడు. ‘వికీపీడియా’లో ‘మోస్ట్ సెర్చింగ్ ప‌ర్స‌న్స్‌’లో షారూఖ్‌కి రెండో స్థానం ద‌క్క‌గా, తొలి స్థానంలో కిమ్ క‌ర్ధాషియాన్ నిలిచింది. హాలీవుడ్ స్టార్స్ టామ్ క్రూజ్‌, లియోనార్డో డి కాప్రియో, ఏంజెలీనా జోలీ వంటి స్టార్స్‌ని కూడా బీట్ చేసి షారూఖ్ ఈ బిగ్ అచీవ్‌మెంట్ సాధించ‌డం విశేషం.