షారుఖ్ ‘విజువల్‌ ఎఫెక్ట్స్‌’ బిజినెస్

తన సినిమాలు తానే నిర్మించుకునే ఓ ప్రొడక్షన్‌ హౌస్‌ను షారుఖ్‌ ఏర్పాటు చేశాడు. అదే  “రెడ్ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌”.షారుఖ్‌ ఖాన్‌ సినిమాలతో పాటు ప్యాపారం కూడా చేస్తాడు. అదీ తన వృత్తికి అనుబంధంగా ఉన్నదే. ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందుతోన్నది విజువల్‌ ఎఫెక్ట్స్‌. సినిమా రంగంలో దీని ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. భారీ బడ్జెట్‌తో తీస్తున్న హాలీవుడ్‌, బాలీవుడ్‌ చిత్రాలన్నిటికీ ఇదే కీలకం.  అత్యధిక  వసూళ్లు   చేసిన ‘బాహుబలి’ అయినా రేపు విడుదలకానున్న రజనీకాంత్‌ చిత్రం ‘2.0’ అయినా వీఎఫ్‌ఎక్స్‌తో ముడిపడి ఉన్నవే. వీటి కోసం ఇతర దేశాలపై మన చిత్ర పరిశ్రమ ఎక్కువగా ఆధారపడుతోంది.

అందుకే షారుఖ్‌ ఖాన్‌ మన దేశంలో విజువల్‌ ఎఫెక్ట్స్‌కు సంబంధించి నంబర్‌ వన్‌ టెక్నాలజీ తీసుకురావాలని భావించాడు. దానిలో భాగంగానే గురుగావ్‌లో దీనికి సంబంధించిన ఆఫీస్‌ను ప్రారంభించాడు. ఇప్పటికే ఈ టెక్నాలజీ ఉపయోగించి 20 నిమిషాల నిడివితో ఓ సినిమా తీశారు. ఇది ఫైనల్‌ రిపోర్టు రావడానికి ఇంకా మెరుగులు దిద్దుతున్నారు. దాని ఫలితాలు వచ్చాక సినీ ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు షారుఖ్‌ ఖాన్‌. ఫలితాలు  బాగుంటే ఇక నుంచి వీఎఫ్‌ఎక్స్అడ్వాన్స్‌ టెక్నాలజీ కోసం ఎక్కడికో  వెళ్ళాల్సిన  అవసరం  ఇక ఉండదు.