ఆ రెండూ ఆమె రూపంలో ఒకేసారి వచ్చేసాయి !

‘మీరెందుకు సార్‌ అంత త్వరగా పెళ్లి చేసుకున్నారు’ అంటూ అభిమాని అడిగిన ప్రశ్నకు షారుఖ్‌ ఇచ్చిన సమాధానం నెటిజన్ల మనసు దోచుకుంటోంది. షారుఖ్‌ ఖాన్‌ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ చిట్‌చాట్‌లో భాగంగా ఓ అభిమానులతో సరదాగా ముచ్చటించారు…
‘మీరెందుకు సార్‌ అంత త్వరగా పెళ్లి చేసుకున్నారు’ అంటూ అభిమాని ప్రశ్నిస్తే … ‘భాయ్‌.. ప్రేమ, అదృష్టం ఎప్పుడైనా వస్తాయి. అయితే నా విషయంలో ఈ రెండు గౌరీ రూపంలో ఒకేసారి వచ్చేశాయి’ అంటూ తాను అంత త్వరగా ఎందుకు పెళ్లి చేసుకున్నారో చెప్పారు. షారుఖ్‌ సమాధానానికి ఫిదా అయిన నెటిజన్లు.. “కింగ్‌ ఆఫ్‌ రొమాన్స్‌” అని మరోసారి ప్రూవ్‌ చేసుకున్నాడ”ని, “గౌరీపై తన ప్రేమని ఎంత గొప్పగా చెప్పారో” … అంటూ ఒకటే కామెంట్లతో హోరెత్తిస్తున్నారు …
షారుఖ్‌ ఖాన్‌ టీవీ షోలు చేస్తున్న సమయంలోనే గౌరీని ప్రేమించారు. సినిమాల్లో అంతగా గుర్తింపు పొందకముందే 1991లో ఆమెను వివాహం చేసుకున్నారు. బాలీవుడ్‌లో “మోస్ట్‌ లవబుల్‌ జంట”గా పేరొందిన వీరికి ఆర్యన్‌, సుహానా, అబ్‌రాం అనే ముగ్గురు పిల్లలున్నారు.

షారుక్‌ కు ఈసారి చోటు దక్కలేదు

ప్రముఖ బిజినెస్‌ మ్యాగజైన్‌ “ఫోర్బ్స్‌” ఈ ఏడాది ప్రపంచంలో అత్యధికంగా ఆర్జిస్తున్న టాప్‌ 100 సెలబ్రిటీల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్‌ నుంచి బాలీవుడ్‌ స్టార్స్‌ అక్షయ్‌ కుమార్‌, సల్మాన్‌ ఖాన్‌లు చోటు దక్కించుకున్నారు. గత ఏడాది షారుక్‌ ఖాన్‌ ఈ జాబితాలో 65వ స్థానంలో నిలువగా ఈసారి మాత్రం చోటు దక్కించుకోలేకపోయారు. 2017 జూన్‌ 1 నుంచి 2018 జూన్‌ 1 మధ్య కాలంలో ప్రముఖల సంపాదన ఆధారంగా ఫోర్బ్స్‌ ఈ జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో అక్షయ్‌ రూ. 276 కోట్లతో 76వ స్థానంలో నిలువగా, సల్మాన్‌ రూ. 257 కోట్లతో 82వ స్థానంలో నిలిచారు. గత ఏడాది ఫోర్బ్స్‌ విడుదల చేసిన జాబితాలో భారత్‌ నుంచి షారుక్‌ రూ.245 కోట్లతో 65వ స్థానంలో, సల్మాన్‌ రూ.238 కోట్లతో 71వ స్థానంలో, అక్షయ్‌ రూ.228 కోట్లతో 80వ స్థానంలో నిలిచారు
ఈ ఏడాది అమెరికన్‌ బాక్సర్‌ ఫ్లాయిడ్‌ మేవెదర్‌ 1946 కోట్లతో ఈ జాబితాలో అగ్ర స్థానంలో నిలువగా, యాక్టర్‌ జార్జ్‌ క్లూనీ 2వ స్థానంలో, అమెరికన్‌ మోడల్‌ కైలీ జెన్నర్‌ 3వ స్థానంలో, ఫుట్‌బాల్‌ ప్లేయర్స్‌ లియోనల్‌ మెస్సీ 8వ స్థానంలో, క్రిస్టియానో రొనాల్డో 10వ స్థానంలో నిలిచారు.