శ‌ర్వానంద్ హీరోగా 14 రీల్స్ ప్ల‌స్ `శ్రీకారం`

శ‌ర్వానంద్ క‌థానాయ‌కుడిగా కొత్త చిత్రం `శ్రీకారం` ఆదివారం లాంఛ‌నంగా హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. డైరెక్ట‌ర్ సుకుమార్ ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ కొట్ట‌గా..ఎన్నారై శ‌శికాంత్ వ‌ల్లూరి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. సాయిమాధ‌వ్ బుర్రా స్క్రిప్ట్‌ను అందించారు. ఈ చిత్రంతో కిశోర్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్‌ప్లేను కిశోర్ రెడ్డి అందించ‌గా.. ప్ర‌ముఖ ర‌చ‌యిత సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. మిక్కి జె.మేయ‌ర్ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. యువ‌రాజ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.
ఆగ‌స్ట్ మొద‌టి వారం నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌ర‌గ‌నుంది. రామ్ ఆచంట‌, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుద‌ల చేసేలా  ప్లాన్స్ జ‌రుగుతున్నాయి.

శ‌ర్వానంద్ హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి

క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం:కిశోర్ రెడ్డి
బ్యాన‌ర్‌: 14 రీల్స్ ప్లస్‌
నిర్మాత‌లు:  రామ్ ఆచంట‌, గోపీచంద్ ఆచంట‌
సంగీతం:  మిక్కి జె.మేయ‌ర్‌,సినిమాటోగ్ర‌పీ:  యువ‌రాజ్‌
ఆర్ట్ డైరెక్ట‌ర్:  అవినాశ్ కొల్ల‌,డైలాగ్స్‌:  సాయిమాధ‌వ్ బుర్రా
ఎడిట‌ర్‌:  మార్తాండ్ కె.వెంక‌టేశ్‌,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  హ‌రీశ్ క‌ట్టా