ఆమె చాలా తెలివైన హీరోయిన్.. పాత్రలో జీవించేస్తుంది !

సాయిపల్లవి… తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటిగా తనదైన శైలిలో  ‘ఫిదా’ చేసిన ఈ నేచురల్ బ్యూటీ ..  యాక్టింగ్ తో యూత్‌ని మెస్మరైజ్ చేస్తోంది.నటిగా మంచి మార్కులు సంపాదించిన సాయిపల్లవిపై కొన్ని ఆరోపణలు ఉన్నాయి. షూటింగ్‌కు ఆలస్యంగా వస్తుందని, తన యాటిట్యూడ్‌తో హీరోలను అసహనానికి గురి చేస్తుందని.. ఇలా సాయిపల్లవిపై ఆరోపణలు వినిపించాయి. యువ కథానాయకుడు నాగశౌర్య ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావించడంతో టాలీవుడ్‌లో సాయిపల్లవి పై పెద్ద హాట్ టాపికే నడిచింది. అయితే సాయిపల్లవి మాత్రం అదేమిలేదని క్లారిటీ ఇచ్చేసింది.
సాయిపల్లవిపై ఇలాంటి ఆరోపణలు వస్తున్న సమయంలో తన తాజా చిత్రం ‘పడి పడి లేచె మనసు’లో హీరోగా నటిస్తున్న శర్వానంద్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. సాయిపల్లవి మంచి నటి, కథను అర్థం చేసుకొని పాత్రలో జీవించేస్తుందని కితాబిచ్చాడు శర్వా. అలాగే తన హీరోయిన్స్‌లో ఆమెకు ఫస్ట్ ర్యాంక్ ఇవ్వొచ్చని.. చాలా తెలివైన హీరోయిన్ అని తెలిపాడు. సాయిపల్లవితో తనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని ముక్తాయించాడు శర్వా. అతని పాజిటివ్ కామెంట్స్‌ సాయిపల్లవి కెరీర్ కి తప్పకుండా ప్లస్ అవుతాయని అంటున్నారు పరిశీలకులు.
యాక్షన్ టాలెంట్‌ చూడొచ్చన్నమాట!

ప్రేమకథల్లో కథానాయికలకు పోరాటాలు చేసే అవకాశాలు తక్కువగా వస్తాయి. రొమాంటిక్‌ థ్రిల్లర్స్‌లోనూ అంతే! ఎక్కువగా కథానాయకుడితో రొమాన్స్‌కు పరిమితమవుతారు. సాయిపల్లవికి రొమాన్స్‌తో పాటు ఫైట్స్‌ చేసే అవకాశం వచ్చింది. రెండేళ్ల విరామం తర్వాత సాయిపల్లవి ఓ మలయాళ చిత్రం చేస్తున్నారు. ఫాహద్‌ ఫాజిల్‌ కథానాయకుడిగా వివేక్‌ దర్శకత్వం వహించే రొమాంటిక్‌ థ్రిల్లర్‌లో నటిస్తున్నారామె. అందులో ఆమె పాత్ర రొమాన్స్‌కి మాత్రమే పరిమితం కావడం లేదు. ఓ థ్రిల్లింగ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లో ఫైటింగ్‌ చేయనున్నారు. ‘‘మా సినిమా ప్రత్యేకత ఏంటంటే.. రెండు యాక్షన్‌ సీక్వెన్సులున్నాయి. ఒకటి హీరో చేస్తే… మరొకటి హీరోయిన్‌ చేస్తారు’’ అని వివేక్‌ తెలిపారు. ఇంకా టైటిల్‌ ఖరారు చేయని ఈ సినిమాతో సాయిపల్లవి యాక్షన్ టాలెంట్‌ చూడొచ్చన్నమాట!

ప్రస్తుతం తమిళంలో సూర్యకి జోడీగా ‘ఎన్జీకే’, ధనుష్‌కి జంటగా ‘మారి 2’ చిత్రాలు చేస్తున్న సాయిపల్లవి.. తెలుగులో శర్వానంద్ కాంబినేషన్‌లో ‘పడి పడి లేచె మనసు’ సినిమాలో నటిస్తోంది.