అంతంత మాత్రంగానే… ‘పడిపడి లేచె మనసు’ చిత్ర సమీక్ష

                                               సినీవినోదం రేటింగ్ : 2.5/5

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు.
కధలోకి వెళ్తే …
సూర్య రావిపాటి (శ‌ర్వానంద్‌) ఫుట్‌బాల్ ప్లేయ‌ర్‌. అత‌నికి డాక్ట‌ర్ వైశాలి (సాయిప‌ల్ల‌వి) అంటే చాలా ఇష్టం. వైశాలి తండ్రి మేజిస్ట్రేట్‌. వీళ్లంద‌రూ కోల్‌క‌తాలో ఉన్న తెలుగువాళ్లు. రెండేళ్ల త‌ర్వాత వైశాలికి సూర్య అంటే ఇష్టం పెరుగుతుంది. ఒక‌రిని ఒక‌రు గాఢంగా ప్రేమించుకుంటారు. ఓ సంద‌ర్భంలో క్యాంప్ కోసం ఖాట్మండుకు వెళ్తుంది వైశాలి. ఆమె చూడ‌కుండా ఉండ‌లేక‌పోయిన సూర్య కూడా ఖాట్మండుకు వెళ్తాడు. అక్క‌డ అనుకోకుండా త‌న తండ్రిని క‌లుస్తాడు. తండ్రిని చూసిన సూర్య‌కు ప్రేమ‌పెళ్లిళ్లు నిల‌వ‌వ‌నే విష‌యం గాఢంగా స్ఫురిస్తుంది. అదే విష‌యాన్ని వైశాలికి చెబుతాడు. ఆమె లివ్ ఇన్ రిలేష‌న్‌కు వ్య‌తిరేకం కాదు, కానీ పెళ్లి చేసుకోవ‌డాన్ని ఇష్ట‌ప‌డుతుంది. ఆ క్ర‌మంలో వారిద్ద‌రు క‌లిసి ఓ నిర్ణ‌యం తీసుకుంటారు. ఆ నిర్ణ‌యం ఏంటి? ప‌్ర‌కృతి వ‌ల్ల వీరిద్ద‌రు తీసుకున్న నిర్ణ‌యానికి ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌య్యాయి? అన్నది సినిమాలో చూడాలి…
విశ్లేషణ…
డైరెక్టర్ హను రాఘవపూడి తన తరహా కవితాత్మక ప్రేమకథతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.ఫస్ట్ హాఫ్ లో తన ప్రతిభ చూపెట్టాడు. ముఖ్యంగా కలకత్తా కల్చర్ ను బాగా చూపెట్టాడు. కథా కథనాలు కాస్త నెమ్మదిగా సాగినా విజువల్స్‌, హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, కామెడీ, సాంగ్స్‌  తొలి భాగాన్ని ఇంట్రస్టింగ్‌గా మార్చేశాయి. కానీ ఇంటర్వెల్‌ సీన్‌ విషయంలో కాస్త తడబడ్డట్టుగా అనిపిస్తుంది. ఇక ఇంటర్వల్ ముందు వచ్చే కాన్ ఫ్లిక్ట్ పాయింట్ సిల్లీ గా అనిపిస్తుంది. అప్పడిదాకా హీరోయిన్ ను పీకలదాకా ప్రేమించిన హీరో ‘పెళ్లి చేసుకుందాం’ అనే సరికి బ్రేక్ చెప్పడం లాంటి విషయాలు అంత కన్విన్స్ గా అనిపించవు.హీరో హీరోయిన్లు విడిపోవడానికి కారణం కన్విన్సింగ్‌గా అనిపించదు.
 
సింపుల్ ప్రేమ కథ కు మెమరీ లాస్ అనే అంశాన్ని జోడించి దాన్ని చక్కగా చేయలేకపోయాడు హను. ఫస్ట్ హాఫ్ ను హైలైట్ చేసి సెకండ్ హాఫ్ ను బోరింగ్ గా మార్చేశాడు.తొలి భాగాన్ని ఎంగేజింగ్‌గా తెరకెక్కించి ద్వితీయార్థంలో మాత్రం దర్శకుడు ఇబ్బంది పడ్డాడు. సినిమా రొటీన్ సీన్స్ తో …ఏ సీనుకు ఆ సీను ప్ర‌త్యేకంగా అనిపిస్తుందే త‌ప్ప‌, క‌థ‌లో ఎక్క‌డా క‌లిసిన‌ట్టు క‌నిపించ‌దు. స‌న్నివేశాల్లో కొత్త‌ద‌నం లేదు.ఎక్కువ సాగ‌దీత‌ అనిపించింది.ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయ్యే అంశాలు పెద్ద‌గా లేవు.అక్కడక్కడా సునీల్‌ కామెడీ వర్క్‌ అవుట్‌ అయినా ఫస్ట్ హాఫ్ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు.క్లైమాక్స్‌ సన్నివేశాలు కూడా హడావిడిగా ముగించేసినట్టుగా అనిపిస్తుంది.
 
నటీనటులు…
సినిమాకు ప్రధానమైన  సూర్య , వైశాలి  పాత్రల్లో నటించిన శర్వానంద్ , సాయి పల్లవి ల నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ గా నిలిచింది. వీరి కెమిస్ట్రీ హైలైట్ అయ్యింది. సూర్య పాత్ర లో నటించిన శర్వా చాలా అద్భుతంగా నటించాడు. ఎమోషనల్ , రొమాంటిక్ , కామెడీ సన్నివేశాలను ఈజీ గా చేస్తూ మరోసారి ట్యాలెంటెడ్ హీరోగా నిరూపించుకున్నాడు. ఇక సాయి పల్లవి కూడా నటన విషయంలో శర్వా కు గట్టి పోటీనిచ్చింది. ముఖ్యంగా కథ అంతా వీరిద్దరి చుట్టూ తిరగడంతో నటీనటులు ఎందరున్నా తెర మీద వీరిద్దరే ప్రత్యేకంగా కనిపిస్తారు.ఉన్నంతలో ప్రియదర్శి, సునీల్‌, వెన్నెల కిశోర్‌లు నవ్వించే ప్రయత్నం చేశారు. మురళి శర్మ, ప్రియా రామన్‌ తమ పాత్రల పరిది మేరకు ఆకట్టుకున్నారు..
 
సాంకేతిక నిపుణులు…
విశాల్ చంద్రశేఖర్‌ సంగీతంసినిమాకు హైలైట్ అయ్యింది..టైటిల్ సాంగ్ బాగుంది .నేపథ్య సంగీతం  సినిమాలోని సన్నివేశాలు ఎలివేట్ అవ్వడానికి ఉపయోగపడింది. జయకృష్ణ సినిమాటోగ్రఫీ కోలకతా లోని లొకేషన్స్ చాలా బాగా చూపెట్టాడు.శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, ఆర్ట్ వర్క్ బాగుంది – రాజేష్