సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్.. శర్వానంద్, సమంత హీరో హీరోయిన్లుగా నిర్మిస్తోన్న చిత్రానికి `జాను` అనే పేరు ఖరారు చేశారు. తమిళంలో విజయవంతమైన `96` కు ఇది రీమేక్. ఈ సినిమా టైటిల్..ఫస్ట్‌లుక్ విడుదల చేసారు .
నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ – `శర్వానంద్, సమంత కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రానికి `జాను` టైటిల్ ఖరారు చేశాం. బ్యూటీఫుల్ అండ్ హార్ట్ టచింగ్ లవ్‌స్టోరి ఇది. షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. దర్శ,కుడు ప్రేమ్‌కుమార్ బ్యూటీపుల్‌గా తెరకెక్కించారు. శర్వానంద్, సమంత పాత్రల్లో ఒదిగిపోయారు. గోవింద్ వసంత సంగీతం..మహేంద్రన్ జయరాజ్ సినిమాటోగ్రఫీ సినిమాకు అదనపు బలం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే టీజర్, పాటలను విడుదల చేస్తాం“ అన్నారు.
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్,సమర్పణ: శ్రీమతి అనిత
సంగీతం: గోవింద్ వసంత,సినిమాటోగ్రఫీ: మహేంద్రన్ జయరాజ్
ఆర్ట్: రామాంజనేయులు,మాటలు: మిర్చి కిరణ్
పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, శ్రీమణి