ప్రేమించకపోతే ఇంత ఇబ్బందిని భరించలేం!

“నిత్యం బిజీగా ఉండటం, క్రేజీ చిత్రాల్లో నటించడం హ్యాపీగా ఉంది. నేను చేసే పనిని ప్రేమిస్తాను. అందుకే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ పనిని పూర్తి చేస్తాను”… అని అంటోంది శ్రద్ధా కపూర్‌. ఈ ఏడాది ‘స్ట్రీట్‌ డాన్సర్‌ 3డీ’, ‘బాఘి 3’ చిత్రాలతో సందడి చేయబోతుంది. గత ఏడాది ‘సాహో’, ‘చిచ్చోర్‌’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది శ్రద్ధా. ఈ రెండు మంచి విజయాలను అందుకున్నాయి. వరుస సినిమాలో నటిస్తూ.. తీరిక లేకుండా గడుపుతున్న శ్రద్ధా బిజీ షెడ్యూల్‌ని ఎలా బ్యాలెన్స్‌ చేస్తుందనే విషయంపై మాట్లాడుతూ…
“నిత్యం బిజీగా ఉండటం, క్రేజీ చిత్రాల్లో నటించడం హ్యాపీగా ఉంది. నేను చేసే పనిని ప్రేమిస్తాను. అందుకే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ పనిని పూర్తి చేస్తాను. బిజీ షెడ్యూల్స్‌ని ఈజీగానే బ్యాలెన్స్‌ చేస్తున్నా. సినీ రంగం చాలా ఎఫర్ట్‌తో కూడుకున్నది. కానీ దాన్ని ఎవరూ చూడరు. అంతిమ ఫలితమే వారికి కావాలి. ఇది చాలా సందర్భాల్లో మహిళలకు చాలా కష్టతరమైన పని కూడా. ఎందుకంటే కాస్ట్యూమ్స్‌, హెయిర్‌ మెయింటేన్‌, డ్రెస్‌ ధరించడంలో చాలా టైమ్‌ పడుతుంది. అందుకు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. మనం చేసే పనిని ప్రేమించపోతే ఇంత ఇబ్బందిని భరించడం కష్టం. నటిని కావాలనేది నా చిన్ననాటి కోరిక. ఇప్పుడు అది నెరవేరింది. అందుకే చేసే పనిలో చిన్న విషయాన్ని కూడా ఆస్వాదిస్తున్నా” అని తెలిపింది.
 
మేకప్‌తోనే అందం వస్తుందంటే…
నేను నాలాగే ఉండాలనేది నా స్టైల్‌ స్టేట్‌మెంట్‌. ఎవరినో అనుకరిస్తే మిగిలేది ‘అనుకరణ’ తప్ప ‘అందం’ కాదు! నా దృష్టిలో నేచురల్‌ బ్యూటీ ప్రొడక్ట్‌ అంటే… మాంచి నిద్ర! ఒళ్లు తెలియకుండా నిద్రపోయేవాళ్లను చూస్తే ముచ్చటేస్తుంది. సరిౖయెన నిద్ర లేకపోతే ఎంత కష్టపడి ఏంలాభం! సరిౖయెన నిద్ర, ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం, అందంగా ఉంటాం!
 
విశాల్‌ భరద్వాజ్‌ ‘హైదర్‌’ సినిమాలో కశ్మీరీ అమ్మాయి ‘అర్షియా’ పాత్ర పోషించాను. మేకప్‌ లేకుండా నటించాను. ‘అందంగా కనిపించలేదు’ అని ఒక్కరూ అనలేదు. మేకప్‌తోనే అందం వస్తుందంటే నేను నమ్మను. నిజంగా చెప్పాలంటే మేకప్‌ లేకపోతేనే నాకు సౌకర్యంగా, సంతోషంగా, సహజంగా అనిపిస్తుంది. కానీ సినిమాల్లో ఉన్నాం కాబట్టి తప్పదు కదా! ఒత్తిడి లేకుండా ఉండాలంటే?