అచ్చం అలా కనిపించేందుకు తీవ్ర శ్రమ

శ్రద్ధా కపూర్‌… క్రేజీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ప్రభాస్‌ ‘సాహో’ సినిమాతో పాటు బాలీవుడ్‌లోనూ విభిన్న చిత్రాల్లో నటిస్తున్నారు శ్రద్ధా. ఇప్పటికే ‘స్త్రీ’ సినిమా షూటింగ్ పూర్తి చేసిన ఈ బ్యూటీ, ‘బట్టి గుల్‌ మీటర్‌ చల్‌’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు.ఇలా డిఫరెంట్‌ జానర్స్‌లో తెరకెక్కుతున్న సినిమాల్లో నటిస్తూనే మరో చాలెంజింగ్‌ రోల్‌కు రెడీ అవుతున్నారు. బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్‌లో నటించేందుకు రెడీ అవుతున్నారు శ్రద్ధా. ప్రస్తుతం ఈ సినిమా కోసం అథ్లెటిక్‌ ఫిట్‌నెస్‌ కోసం కష్టపడుతున్నారు. వచ్చే నెలలో ఈ బయోపిక్‌ షూటింగ్ ప్రారంభం కానుంది.
 
కొందరు నటీనటులు పాత్రను రక్తికట్టించడం కోసం ఏమైనా చేస్తారు. ఇక బయోపిక్‌ చిత్రాల కోసమైతే ఏకంగా పాత్రలో పరకాయ ప్రవేశం చేయాలని తపిస్తుంటారు. అందుకోసం తమ బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకోవడమే కాదు, తినే ఆహారం విషయంలోనూ భారీ మార్పులు చేస్తుంటారు. తాజాగా బాలీవుడ్‌ కథానాయిక శ్రద్ధా కపూర్‌ అదే పని చేస్తోంది. తెరపై బాడ్మింటన్‌ స్టార్‌ సైనా సెహ్వాల్‌గా కనిపించేందుకు కసరత్తులు ప్రారంభించింది. సైనా బయోపిక్‌ కోసం తన శరీరాకృతిని, ఆహార నియమాలను మార్చుకుంటోంది. బాడ్మింటన్‌ ఆడే క్రమంలో మజిల్స్‌ పట్టేయకుండా ఫిజియోథెరపిస్ట్‌ సూచనలు పాటిస్తున్నారు. డే బై డే సమయాన్ని పెంచుతూ బాడ్మింటన్‌ ఆడుతున్నారు. ప్రతి రోజూ జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తున్నారు. దీని కోసమై ప్రత్యేకమైన డైట్‌ని కూడా ఫాలో అవుతున్నారు. అత్యధిక ప్రొటీన్స్‌ కలిగిన ఫుడ్‌ను తీసుకోవడంతోపాటు స్వీట్స్‌కిదూరంగా ఉంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే అచ్చం సైనాలా కనిపించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సైనా బయోపిక్‌ కోసం శ్రద్ధా తీసుకునే కేర్‌, ఎఫర్ట్‌ చూసి చిత్ర వర్గాలే ఫిదా అయిపోతున్నారట.శ్రద్ధా ప్రస్తుతం ‘సాహో’, ‘స్త్రీ’, ‘బట్టీ గుల్‌ మీటర్‌ ఛాలూ’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.