ఓపిక పట్టలేకపోయా.. అసహనానికి గురయ్యా!

“డిగ్రీ చేశాకే చిత్రసీమలోకి ఎంట్రీ ఇద్దామనుకున్నా. కానీ అనుకోకుండా ఆఫర్లు, అవకాశాలు వచ్చాయి. అవి అలా పెరుగుతూనే ఉన్నాయి. నేను ఓపిక పట్టలేకపోయా. అసహనానికి గురయ్యా”…అని అంటోంది బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌. శ్రద్ధా కపూర్‌ త్వరలో ‘చిచ్చోరే’ చిత్రంలో కనిపించబోతుంది. ఆ సినిమా ఏడుగురి స్నేహితుల జీవితాలపై రూపొందిస్తున్నారు. చిన్న తనం నుంచి వృద్ధాప్యం వరకూ ఈ సినిమాలో ఆ ఏడుగురి జీవితాలపై చర్చించనున్నారు. ఈ చిత్రం ప్రమోషన్‌ పనుల్లో శ్రద్ధా బిజీగా ఉంది. దీనిలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..’డిగ్రీ ఎందుకు చదవలేకపోయింద’న్న విషయాన్ని వివరించింది.
 
“సినిమా ఇండిస్టీలోకి వస్తే బయటపడడం కష్టమని తెలుసు. అందుకే డిగ్రీ చేశాకే చిత్రసీమలోకి ఎంట్రీ ఇద్దామనుకున్నా. కానీ అనుకోకుండా ఆఫర్లు, అవకాశాలు వచ్చాయి. అవి అలా పెరుగుతూనే ఉన్నాయి. నేను ఓపిక పట్టలేకపోయా. అసహనానికి గురయ్యా. అందుకే ఇక కాలేజీకి వెళ్లకూడదని నిర్ణయించుకన్నా. వెంటనే కెరీర్‌పైనే దృష్టిపెట్టాలని అనుకున్నా” అని పేర్కొంది. ఆ తర్వాత తన అభిమానులు ఎంతగా చెప్పినా సరే.. డిగ్రీ పూర్తిచేసేందుకు మాత్రం అంగీకరించలేదట శ్రద్ధా. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌తో కలసి నటించిన ‘చిచ్చోరే’ చిత్రం ఈనెల 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. నితీశ్‌ తివారి దర్శకత్వం వహించారు
 
పర్యావరణ పరిరక్షణ కోసం…
‘సోషల్‌ మీడియాని వ్యక్తిగతంగానే కాదు, సామాజికంగానూ, ప్రకృతి, పర్యావరణం పరిరక్షణ కోసం ఉపయోగించాలనుకుంటున్నా’ అని అంటోంది శ్రద్ధా కపూర్‌.”ప్రకృతి పరిరక్షణ, సామాజిక సమస్యలు, జంతు సంక్షేమం వంటి అంశాలను ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేయాలనుకుంటున్నా. మున్ముందు మరింతగా దీనిపై చర్చించాలని, అది ప్రజల్లోకి తీసుకెళ్ళాలనుకుంటున్నా. ఎందుకంటే మన మనుగడ వీటిపైనే ఆధారపడి ఉంటుంది” అని తెలిపింది.
శ్రద్ధా త్వరలో ‘బాఘి 3’లో నటించబోతుంది. ఈ సిరీస్‌లో వచ్చిన మొదటి సినిమా ‘బాఘి’లో టైగర్‌ సరసన శ్రద్ధా కథానాయికగా నటించిన విషయం విదితమే. ఈ సందర్బంగా ఆమె చెబుతూ… ‘మనం నటించే ప్రతి సినిమా బాగా ఆడాలని కోరుకుంటాం. కానీ అది ఆడియెన్స్‌ మనసు దోచుకున్నదాన్ని బట్టి ఉంటుంది. నా వరకు ప్రతి సినిమాకి సిన్సియర్‌గా హార్డ్‌ వర్క్‌ చేస్తా. ఫలితాన్ని ఆడియెన్స్‌ కి వదిలేస్తా. ఇప్పుడు ‘బాఘి 3’కోసం ప్రిపరేషన్‌ చాలా బాగా సాగుతుంది. సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తిగా వెయిట్‌ చేస్తున్నా’ అని అన్నారు. ఈ సినిమా సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే శ్రద్ధా టెన్నీస్‌ స్టార్‌ సానియా మీర్జా బయోపిక్‌లో నటించబోతున్న విషయం విదితమే. దీంతోపాటు ‘చిచ్చోర్‌’, ‘స్ట్రీట్‌ డాన్సర్‌’ చిత్రాల్లో నటిస్తుంది. తెలుగులో ఎంట్రీ ఇస్తూ నటించిన ‘సాహో’ విడుదలై మిశ్రమ స్పందనని రాబట్టుకుంటోంది.