‘సాహో’ కోసం సీరియస్ గా నేర్చేసుకుంటోంది !

ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ‘సాహో’ చిత్రం తెలుగుతో పాటు హిందీలో కూడా తెరకెక్కుతోంది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు.   ‘సాహో’ను ఒకేసారి తెలుగుతో పాటు హిందీలో కూడా తెరకెక్కిస్తుండడంతో పలువురు బాలీవుడ్ నటులను ఈ సినిమా కోసం ఎంపిక చేశారు. అయితే సినిమాలోని బాలీవుడ్ నటులు కాస్త తెలుగు భాష మీద పట్టు సాధిస్తున్నారట. తెలుగు సీన్స్ తీసినప్పుడు సులభంగా ఉంటుందని బాలీవుడ్ నటులను తెలుగు నేర్చుకోమని చెప్పాడట దర్శకుడు సుజిత్. ముఖ్యంగా ఈ సినిమాతో మొదటిసారి తెలుగు తెరకు పరిచయం కాబోతున్న శ్రద్ధాకపూర్ అయితే సీరియస్‌గా తెలుగు నేర్చుకుంటోందట.

తాజాగా ఈ విషయాన్ని ఈ ముద్దుగుమ్మనే చెప్పింది….” తెలుగు సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని… తాను తెలుగు నేర్చుకుంటాన”ని చెప్పింది శ్రద్ధాకపూర్. ఇక తాను మొదటిసారి తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నటిస్తున్నానని పేర్కొంది ఈ భామ. సాహో సినిమా షూటింగ్‌లో ఓవైపు తెలుగు, మరోవైపు హిందీ సీన్‌ల చిత్రీకరణ జరుగుతుండడం ఆసక్తిగా ఉందని పేర్కొంది. చివరగా ప్రభాస్ గురించి ఈ భామ ఓ మాట చెప్పింది. ప్రభాస్ ‘ఇండియన్ స్టార్ అని శ్రద్ధాకపూర్ పేర్కొంది.