శ్రవణ్‌ ‘ప్రేమపందెం’ పోస్టర్‌ ఆవిష్కరణ !

శ్రీ లక్ష్మీ ప్రొడక్షన్స్‌ పతాకంపై అనంతపురం జిల్లాకు చెంది ప్రముఖ విద్యాసంస్థ అధిపతి ఎం. లక్ష్మీనారాయణ నిర్మాతగా ఎం.ఎం. అర్జున్‌ దర్శకత్వంలో శ్రవణ్‌,మీనాక్షి గోస్వామి జంటగా నిర్మించిన ‘ప్రేమపందెం’ చిత్రం పోస్టర్‌లాంచ్‌ కార్యక్రమం గాంధీ జయంతిని పురస్కరించుకుని ఫిల్మ్‌ ఛాంబర్‌లోని ప్రివ్యూ థియేటర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్రంలోని నటీనటు, టెక్నీషియన్స్‌ అందరూ హాజరయ్యారు. చిత్ర నిర్మాత ఎం. లక్ష్మీనారాయణ పోస్టర్స్‌ను ఆవిష్కరించి యూనిట్‌ సభ్యుకు అందజేశారు.
ఈ సందర్భంగా నిర్మాత ఎం. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. నేను కూడా గతంలో 5 సంవత్సరాలు   జర్నలిస్ట్‌గా పనిచేశాను. మా దర్శకుడు అర్జున్‌ చెప్పిన పాయింట్‌ నచ్చడంతో ఈ సినిమాను టేకప్‌ చేశాను. సినిమా క్వాలిటీగా రావడానికి ఎంతో కృషి చేశాం. ఖర్చు విషయంలో వెనకడుగు వేయలేదు. పేరుకే చిన్న సినిమా అయినా పెద్ద సినిమా స్థాయి అవుట్‌పుట్‌ ఇచ్చాడు మా దర్శకుడు. ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. త్వరలోనే ఆడియోను, ఆ తరువాత చిత్రాన్ని విడుదల  చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం అన్నారు.
దర్శకుడు ఎం.ఎం. అర్జున్‌ మాట్లాడుతూ.. ఇది చాలా ఇంట్రస్టింగ్‌ కలిగించే కథ. మా హీరోయిన్‌ మీనాక్షి గోస్వామికి మంచి నటనకు స్కోప్‌ ఉండే పాత్ర దొరికింది. ఈ సినిమాకు కథే హీరో. ప్రధాన పాత్రలో నటించిన శ్రావణ్‌ ప్రాణం పోశాడు. జబర్‌దస్గ్‌ వినోద్‌ను మగాడి గెటప్‌లో చూపించాం. ఇందులోని సన్నివేశాు అటు ఎమోషన్‌ను, ఇటు ఎంటర్‌టైన్‌మెంట్‌ను చక్కగా పండిరచాయి. నేను చెప్పిన కథను నమ్మి సినిమా చేసిన నిర్మాత లక్ష్మీనారాయణ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. మా టీం సభ్యు అందరూ ఎంతగానో కృషి చేశారు. సెన్సార్‌కు సిద్ధమౌతోంది అన్నారు.
చిత్రంలో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్‌ అందరూ సినిమా విజయవంతం కావాని కోరుకుంటున్నట్లు తమ ప్రసంగాల్లో తెలియజేశారు.
శ్రవణ్‌ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, జబర్‌దస్త్‌ వినోద్‌, కిరణ్‌ కళ్యాణ్‌, సాంబశివ, నరేష్‌, మీనాక్షి గోస్వామి, సునీత, చైతన్య, దేవిక, కోట శంకర్రావు, బస్టాప్‌ కోటేశ్వరరావు, సీనియర్‌ వినోద్‌, సుజాత, ధర్మతేజ, హాసిని, ఓబయ్య మొదగువారు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి మాటు: ఓబుయ్య, ఎడిటింగ్‌: సంతోష్‌, సంగీతం: వెంకట్‌ ఎస్‌.వి.యు., రీరికార్డింగ్‌: మహీధన్‌, కొరియోగ్రఫీ: శామ్యూల్‌, కెమెరా: అమర్‌ జి., సహకారం శరత్‌సాగర్‌, కో ప్రొడ్యూసర్‌: ఓబయ్య సోమిరెడ్డిపల్లె, కో డైరెక్టర్‌: గణేష్‌ ముత్యా. పి.ఆర్‌.ఓ: ‘సింహాసనం’ సురేష్‌, నిర్మాత: ఎం. లక్ష్మీనారాయణ, కథ, కథనం, దర్శకత్వం: ఎం.ఎం. అర్జున్‌.