ఏదో ఒక కొత్త తరహా పాత్రలో కన్పించాలి !

ముచ్చటగా మూడోసారి శ్రియ బాలకృష్ణ నటిస్తున్న 101వ చిత్రం ‘పైసా వసూల్‌’లో నటిస్తున్నారు. ‘చెన్నకేశవ రెడ్డి’చిత్రంలో నందమూరి బాలకృష్ణకు జోడీగా నటించారు శ్రియ. ఆ తర్వాత బాలయ్య100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో రెండోసారి ఆయనకి జోడీ కట్టారు.  ఈ విషయాలను శ్రియ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు…..

‘ఎన్ని పాత్రలు చేసినా.. అభిమానులకు ఏదో ఒక కొత్త తరహా పాత్రలో కన్పించాలని అనుకుంటాను. ‘పైసావసూల్‌’ చిత్రంలో నేను జర్నలిస్ట్‌ పాత్రలో కన్పించనున్నాను. బాలకృష్ణతో నేను చేస్తున్న మూడో చిత్రమిది. 100కు పైగా సినిమాల్లో నటించిన ఆయనతో సినిమాలు చేయడం నా అదృష్టం.’‘పూరీ జగన్నాథ్‌ గొప్ప దర్శకుల్లో ఒకరు. చాలా సినిమాలకు నేను కొత్తదర్శకులతో కలిసి పనిచేశాను. అలా నేను చేసిన ప్రతీ సినిమా ఒక్కో అనుభూతిని మిగిల్చింది’

‘ఇక ‘నక్షత్రం’ సినిమాలో ప్రత్యేక పాటలో నటించడానికి కారణమేంటి అని చాలా మంది అడుగుతున్నారు. నాకు స్క్రిప్ట్‌ చాలా నచ్చింది. అందుకే ఒప్పుకున్నాను. ‘పైసా వసూల్‌’ చిత్రమే కాకుండా ‘వీర భోగ వసంతరాయులు’ చిత్రంలోనూ నటిస్తున్నాను. ఇందులో నేను పోలీస్‌ అధికారిణి పాత్రలో కన్పించనున్నాను. నా సినీ కెరీర్‌లో తొలిసారి పోలీస్‌గా కన్పించనున్నాను. అభిమానులు నన్ను ఆ పాత్రలో ఎప్పుడు చూస్తారా? అని ఆతృతగా ఎదురుచూస్తున్నాను’ అని చెప్పుకొచ్చారు శ్రియ.