ఆ క్రీమ్ వాడితేనే పెళ్ళవుతుందా?

శ్రియ శరన్… ఆమెని చేయమని వస్తున్న కమర్షియల్ యాడ్స్ విషయంలో చాలా కండిషన్స్ పెడుతుందట శ్రియ. అబద్దాలను ప్రచారం చేసే యాడ్స్ ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించడం నాకు నచ్చదు…అని తెగేసి చెప్పేస్తోంది.
 
ఇప్పుడు హీరోయిన్స్ కేవలం తెరపై కనిపించే గ్లామర్ డాల్స్ గానే ఉండాలనుకోవటం లేదు. తమ సామాజిక ఆలోచనలతో మహిళల సమస్యల గురించి మాట్లాడుతున్నారు. పోరాడుతున్నారు. తాజాగా శ్రియ…ఫెయిర్ నెస్ క్రీమ్ లపై తన గొంతు విప్పారు. అవి రాసుకుంటేనే పెళ్లి అవుతుందా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆమె దగ్గరకు చేయమని వస్తున్న కమర్షియల్ యాడ్స్ విషయంలో చాలా కండీషన్స్ పెడుతుందట.
 
శ్రియ మాట్లాడుతూ …‘‘నేను మొదటినుంచీ కొన్ని కమర్షియల్ యాడ్స్ కి వ్యతిరేకిని. “ఫెయిర్‌నెస్‌ క్రీమ్ వాడితే తెల్లగా అవుతారనీ, త్వరగా పెళ్ళవుతుంద”న్న ప్రకటన ఒకటి ఆ మధ్య బాగా వచ్చింది. ఆ ప్రకటన ముందు వచ్చింది నా దగ్గరికే. కాని నేను చేయనంటూ రిజక్ట్‌ చేశాను. ఆ క్రీమ్ వాడితేనే పెళ్ళవుతుందా? లేకపోతే కాదా? తెల్లగా ఉండడం అన్నది చర్మ సౌందర్యానికి సంబంధించినది. అది స్వతహాగా రావాలి తప్ప, క్రీములు వాడితే రాదు.ఇలాంటి అబద్దాలను ప్రచారం చేసే యాడ్స్ ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించడం నాకు నచ్చదు. వారికి క్లియర్ గా చెప్పేస్తూంటాను. అందుకే కొన్ని యాడ్స్ కు ఎంత డబ్బు ఇస్తామన్నా ఒప్పుకోను. జీవితమంటే కేవలం డబ్బు సంపాదనే కాదు .సమాజంలో బ్రతుకుతున్నాం. కొంత బాధ్యత ఉండాలి కదా…అని గుర్తించుకోవాలి.
 
అయితే హీరోయిన్‌ కాకముందు కొన్ని కాస్మోటిక్ ప్రొడక్ట్స్ కు మోడలింగ్‌ చేశారు కదా?… అని అడిగేవాళ్లకు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. ఆ ప్రకటనల ద్వారా అన్ని నిజాలే చెప్పానని అనను కానీ, మరీ అవాస్తవాలను వాస్తవాలుగా చూపించలేదు. అయినా ఆ ప్రకటనలు చేసే సమయంలో నా వయస్సు చాలా తక్కువ. అంత పరిపక్వత లేదు. ఇప్పుడు అలాంటివి ఒప్పుకోను’’ అని శ్రియా చెప్పుకొచ్చింది. ఆమె వెంకటేష్ సరసన హ్యాట్రిక్ చిత్రం ‘వెంకీమామ’ లో చేస్తోంది.