ఫోన్ చేసి ఆఫర్ల కోసమని అడుగుతోందట !

శ్రియా…. టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలం హీరోయిన్‌గా కెరీర్ కొనసాగించిన హీరోయిన్లలో శ్రియాదే రికార్డు. ఆమె దాదాపు 17 సంవత్సరాలకు పైగా హీరోయిన్‌గా కొనసాగుతూ చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల వరకు అందరి పక్కన ఆడిపాడింది. మూడు పదుల వయసులోనూ హాట్ పోజులతో, గ్లామర్ లుక్స్‌తో కనిపిస్తూ ఫిల్మ్‌మేకర్స్‌ను ఆకట్టుకుంటోంది. అయితే ఇటీవల తన రష్యన్ బాయ్‌ఫ్రెండ్ ఆండ్రీను పెళ్లి చేసుకున్న శ్రియా సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది.  కొన్ని రోజుల పాటు భర్తతో వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేసిన ఆమె ఇప్పుడు మళ్లీ సినిమాల వైపు దృష్టి పెడుతోంది. హైదరాబాద్‌లో తెలిసిన మేనేజర్లు అందరికీ ఫోన్ చేసి తనకు ఆఫర్లు చూడమని అడుగుతోందట. నిన్న మొన్నటివరకు సీనియర్ హీరోల సరసన నటించింది శ్రియా. రెమ్యునరేషన్ కూడా మరీ ఎక్కువేం కాకపోవడంతో దర్శకులు ఆమెను తమ సినిమాల్లో తీసుకున్నారు. శ్రియా పెళ్లి చేసుకోవడంతో దర్శకులు, నిర్మాతలంతా ఇతర సీనియర్ హీరోయిన్లపై దృష్టిపెట్టారు. నయనతార, కాజల్, తమన్నా వంటి సీనియర్ స్టార్లకు ప్రాధాన్యతనిస్తున్నారు. దాంతో శ్రియాకు ఇప్పుడు సీనియర్ హీరోల పక్కన నటించే అవకాశం రావడం కష్టంగానే కనిపిస్తోంది.

‘ఏఏఏ’ చిత్రంపై ఆమె విమర్శలు…
వివాహం అనంతరం మళ్లీ కోలీవుడ్‌లో శ్రియ రీ ఎంట్రీ ఇస్తోంది. ‘నా వద్ద ఒక కథ చెప్పి ఇంకో విధంగా చిత్రీకరిస్తున్నారు’ అంటూ తమిళంలో ఆదిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఏఏఏ’ చిత్రంపై ఆమె విమర్శలు గుప్పిస్తోంది. కోలీవుడ్‌లో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన శ్రీయ మాట్లాడుతూ…. ‘ప్రస్తుతం కారీక్‌నరేన్‌ దర్శకత్వంలో అరవింద్‌స్వామితో కలసి ‘నరకాసురన్‌’ చిత్రంలో మాత్రమే నటిస్తున్నా. ఇకపై పాటలు, సన్నివేశాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నాను’ అని పేర్కొంది. వివాహమైన తరువాత శ్రియ భర్త రష్యా వెళ్లగా, ఆమె మాత్రం చెన్నైలో ఉంటోంది.