నా బాయ్ ఫ్రెండ్ ని చూస్తారా !

“రాగ్ దేష్” ….. తిగ్ మన్షు దులియా ద‌ర్శ‌క‌త్వంలో కునాల్ క‌పూర్, మోహిత్ మ‌ర్వా, మృదుల, అమిత్ స‌ద్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన చిత్రం . ఈ రోజు గ్రాండ్ గా విడుద‌లైన ఈ చిత్రం సెల‌బ్రిటీల కోసం ప్ర‌త్యేకంగా స్పెష‌ల్ స్క్రీనింగ్ జ‌రుపుకుంది. డిఫ‌రెంట్ ఫీల్డ్స్ కి సంబంధించిన సెల‌బ్రిటీలు ఈ షోకి హాజ‌ర‌య్యారు. ర‌ణదీప్ హుడా, హృతిక్ రోష‌న్, కిర‌ణ్ రాం , సౌర‌భ్ మిశ్రా తో పాటు దిగ్విజ‌య్ సింగ్ ఆయ‌న భార్య‌తో క‌లిసి ఈ షోకి వ‌చ్చారు. అయితే ఇంత మంది సెల‌బ్రిటీలు వ‌చ్చిన మీడియా అటెన్ష‌న్ మాత్రం శృతిపై మాత్ర‌మే ఉంది.

అందుకు కార‌ణం… ఈ అమ్మ‌డు త‌న బాయ్ ఫ్రెండ్ మైఖేల్ కొర్సలే తో క‌లిసి షోకి హాజ‌రు కావ‌డ‌మే. ఈ ఇద్ద‌రు క‌లిసి కొద్ది సేపు అక్క‌డ తెగ హ‌డావిడి చేయ‌గా, ఫోటోగ్రాఫ‌ర్స్ ఈ జంట‌ని త‌మ కెమెరాల‌లో బంధించారు. లండన్ లో ఉంటున్న‌ ఇటాలియ‌న్ బాయ్ మైఖేల్ కొర్సలే బుధవారం రాత్రి ముంబై ఎయిర్ పోర్ట్ లో దిగగా , అత‌డిని రిసీవ్ చేసుకోవడానికి శృతి ఎయిర్ పోర్ట్ కి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. మైఖేల్ కారులోకి ఎక్క‌గానే ఎగ్జైట్ మెంట్ తో అత‌డిని గట్టిగా హగ్ చేసుకుంది .ఆ ఫోటోలు సోష‌ల్ మీడియాలో ఫుల్ వైర‌ల్ గా మారాయి.