అతనితో అవకాశం వస్తే.. పారితోషికాన్ని పట్టించుకోను !

శృతి హాసన్.. మూడేళ్ళు గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేస్తోంది. రవితేజ  ‘క్రాక్’ లో హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న క్రాక్ షెడ్యూల్ ఈ మధ్యే గోవాలో ముగిసింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ‘వకీల్ సాబ్’ సినిమాలో కూడా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ‘గబ్బర్ సింగ్’, ‘కాటమరాయుడు’ సినిమాల తర్వాత పవన్ తో మూడోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది శృతి హాసన్. ఇప్పటి వరకు ఒక హీరోయిన్ కు మూడు సార్లు పవన్ ఎప్పుడు అవకాశం ఇవ్వలేదు.. కానీ శృతిహాసన్ మాత్రం ఆ అవకాశం అందుకుంది.

‘తెలుగులో ఒక హీరోతో తనకు నటించాలని ఉంది’ అని శృతి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చెప్పింది. అతనితో అవకాశం వస్తే పారితోషికం తక్కువ ఇచ్చినా పర్లేదు అంటూ వివరించింది .అసలు రెమ్యూనరేషన్ మాట కూడా ఎత్తను అంటూ చెప్పింది. శృతి హాసన్ మనసులో అంతగా చోటు సంపాదించుకున్న ఆ హీరో ఎవరో కాదు ప్రభాస్. ఆయనతో నటించే అవకాశం వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను అంటుంది ఈ ముద్దుగుమ్మ. ప్రభాస్ సినిమాలో అవకాశం వస్తే పారితోషికం తనకు అసలు సమస్య కాదు అంటుంది. ఎంత ఇచ్చినా కూడా ఆయన సరసన నటిస్తానని చెబుతోంది. తనకు ప్రభాస్ తో నటించడం కల అని చెప్పింది శృతి హాసన్. ఆమె ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు.. తమిళంలో ఒక సినిమా.. హిందీలో ఒక సినిమా చేస్తూ బిజీగా ఉంది. తన బాయ్ ఫ్రెండ్ మైఖెల్ కోర్సేల్ తో విడిపోయిన తర్వాత కెరీర్ పై పూర్తి ఫోకస్ పెట్టింది శృతి. మళ్లీ ఫిజిక్ పై దృష్టి పెట్టి సన్నగా మెరుపు తీగలా మారింది. దీంతో మళ్లీ తనకు అవకాశాలు మునుపటిలా వస్తాయని భావిస్తోంది ఈ ముద్దుగుమ్మ. దానికి రవితేజ ‘క్రాక్’ సరైన ట్రాక్ వేస్తుందని..ఇక పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ ఎలాగూ ఉండనే ఉందని.. ఈ రెండు సినిమాలు తనకి పూర్వ తీసుకు వస్తాయని నమ్ముతుంది శృతి హాసన్.

మానసిక శక్తుల్ని పునరుత్తేజం చేసే దివ్యౌషదం!… కథానాయిక శృతిహాసన్‌ సంగీతాభిరుచి గురించి అందరికి తెలిసిందే. స్వర రచనతో పాటు సొంత గళాన్ని వినిపిస్తూ.. ఈ సుందరి కొన్ని ప్రైవేట్‌ ఆల్బమ్స్‌  రూపొందించి సత్తాచాటుకుంది. నటన, సంగీతం, గానంలో ప్రతిభను చాటుతూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఈ భామ పేరు తెచ్చుకుంది. సంగీతం మన మానసిక శక్తుల్ని పునరుత్తేజం చేసే ఓ దివ్యౌషదమని శృతిహాసన్‌ చెప్పింది… ‘ఏమాత్రం తీరిక దొరికినా సంగీతాన్ని ఆశ్రయిస్తా. మనసులోని ఆందోళనలన్నింటిని మటుమాయం చేసే శక్తి సంగీతానికి ఉంది. ఒకానొక సమయంలో నేను తీవ్రమైన డిప్రెషన్‌కు గురయ్యాను. మనసంతా ఒత్తిళ్లతో నిండిపోయి ఉండేది. ఏం చేయాలో తోచేది కాదు. అప్పుడు సంగీతం నాకు ఓదార్పునిచ్చింది. నేను సాధారణ స్థితికి చేరుకోవడానికి దోహదపడింది. భవిష్యత్తులో కూడా నా సంగీత ప్రయాణాన్ని కొనసాగిస్తా’ అని చెప్పుకొచ్చింది.