మిమ్మల్ని మీరు ప్రేమించండి !

“ప్రేమించండి. మిమ్మల్ని మీరు ప్రేమించండి’’ అంటున్నారు శ్రుతీహాసన్‌. ఈ విషయం గురించి వివరంగా మాట్లాడుతూ– ‘‘మన అమ్మానాన్నలను, తోడబుట్టినవాళ్లను, స్నేహితులను, జీవిత భాగస్వామిని.. ఇలా లైఫ్‌టైమ్‌లో చాలామందిని ప్రేమిస్తాం. మరి మనల్ని మనం ప్రేమిస్తున్నామా? అని ఎవరైనా ఒక్కక్షణం ఆలోచించాలి. మిమ్మల్ని మీరు ప్రేమిస్తే ఓకే. లేకపోతే ఈ క్షణం నుంచి మిమ్మల్ని మీరు ప్రేమించడం మొదలుపెట్టండి. మీ తొలి ప్రాధాన్యత మీరే అవ్వాలి. ఆ తర్వాతే వేరే ఎవరైనా.వాళ్లేదో అనుకుంటారు.. వీళ్లేదో అనుకుంటారని ఆలోచించొద్దు. ఎవరేం అనుకున్నా ఫర్వాలేదు. మీకు నచ్చినట్లుగా మీరు ఉండండి. అప్పుడే జీవితానికో అర్థం ఉంటుంది. ఇతరుల కోసం బతికితే మన జీవితం మనది కానట్లే’’ అన్నారు శ్రుతీహాసన్‌.
తమిళ సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ?
శ్రుతి పలు మ్యూజిక్‌ షోలతో బిజీగాఉంది. ఇందులో భాగంగా ఆమె ఇండియా-లండన్‌-లాస్‌ ఏంజెల్స్‌కు తరచూ ప్రయాణిస్తున్నారు. ఇటీవల ఆమె లండన్‌లో ఇచ్చిన ఓ షోకు మంచి స్పందన లభించింది. ఆమె పాట పాడుతున్న వీడియోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టాయి. మరోపక్క శ్రుతి ‘శభాష్‌ నాయుడు’ సినిమాలో నటిస్తున్నారు. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ ఉంది. కమల్‌ హాసన్‌ ఇందులో కథానాయకుడి పాత్ర పోషిస్తున్నారు. రమ్యకృష్ణ, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ప్రస్తుతం హిందీలో ఓ సినిమా చేస్తున్న శ్రుతి ఇటీవల తమిళంలో ఓ సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు టాక్‌.
 
శ్రుతి హాసన్‌ చివరిసారి వెండితెరపై ‘ఎస్‌ 3’ సినిమాలో కనిపించారు. 2017లో విడుదలైన ఈ సినిమాలో సూర్య, అనుష్క ప్రధాన పాత్రల్లో నటించారు. దీని తర్వాత శ్రుతి తెలుగు, తమిళంలో కొత్త ప్రాజెక్టుకు సంతకం చేయలేదు. కాగా ఇప్పుడు ఆమె కోలీవుడ్‌లో ఓ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. విజయ్‌ సేతుపతి కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఎస్పీ జననాథన్‌ దీనికి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా ఇందులో కథానాయిక పాత్ర కోసం దర్శక, నిర్మాతలు శ్రుతిని సంప్రదించినట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
 
చిరంజీవి, కొర‌టాల శివ‌ సినిమాలో…
మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న `సైరా` త‌ర్వాత వ‌రుస విజ‌యాల ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌తో చిరంజీవి ఓ సినిమా చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే ప్రీ-ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప‌లువురి పేర్లు తెర‌మీద‌కు వ‌చ్చాయి. తాజాగా ఈ సినిమా గురించి ఓ అప్‌డేట్ బ‌య‌టికొచ్చింది.చాలా రోజులుగా వెండితెర‌కు దూరంగా ఉన్న శృతి హాస‌న్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర‌లో క‌నిపించ‌బోతోంద‌ట‌. అయితే ఆమె హీరోయిన్‌గా క‌న‌బ‌డుతోందా? లేక‌ వేరే కీల‌క పాత్ర‌లో న‌టిస్తోందా? అనేది తెలియాల్సి ఉంది. మెగా ఫ్యామిలీలో ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ల్యాణ్‌, రామ్‌చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ వంటి హీరోల స‌ర‌స‌న శృతి న‌టించింది. కొర‌టాల శివ తెర‌కెక్కించిన `శ్రీమంతుడు` సినిమాలో కూడా శృతి న‌టించింది.