ఆ ఆనందానికి ఎప్పటికీ దూరమవ్వను !

“చాలా రోజుల తర్వాత కెమెరా ముందుకురావడం కొత్త అనుభూతిని పంచుతున్నది. మంచి కథల కోసం ఎదురుచూడటం వల్లే ఇన్నాళ్లు గ్యాప్ వచ్చింది. నటన నా జీవితంలో ఓ భాగం. ఆ ఆనందానికి ఎప్పటికీ దూరమవ్వను” అని తెలిపింది శృతిహాసన్ తన కొత్త చిత్రం ప్రారంభం సందర్భంగా …..

లండన్‌కు చెందిన నటుడు మైఖేల్ కోర్సెల్‌తో ప్రేమాయణం, పరాజయాల కారణంగా… ఏడాది కాలంగా శృతిహాసన్ సినిమాలకు దూరంగా ఉంటున్నట్లు తమిళ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్‌లో వచ్చిన అవకాశాల్ని తిరస్కరిస్తున్నట్లు తెలిసింది. పెళ్లిచేసుకొని జీవితంలో స్ధిరపడాలనే ఆలోచనలో శృతిహాసన్ ఉన్నట్లు, అందుకే కొత్త సినిమాల్ని అంగీకరించడం లేదని ప్రచారం జరుగుతున్నది. గత కొంతకాలంగా ఈ జంట చెట్టపట్టాలేసుకొని తిరుగుతుండటంతో వీరి పెళ్లి నిజమేనంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ పుకార్లకు పుల్‌స్టాఫ్ పెడుతూ ఏడాది విరామం తర్వాత హిందీ సినిమా చిత్రీకరణను మొదలుపెట్టింది శృతిహాసన్.  ఒక‌ప్పుడు వ‌రుస సినిమాల‌తో ఇటు తెలుగు అటు హిందీలో బిజీగా ఉండేది. తెలుగులో చివ‌రిగా ‘కాట‌మ‌రాయుడు’ చిత్రం చేసిన శృతి హిందీలో ‘బెహెన్ హోగీ తేరీ’ అనే చిత్రం చేసింది. ఇక త‌న తండ్రి స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ‘శ‌భాష్ నాయుడు’ చిత్రంలో న‌టించింది. ఈ సినిమా ఎప్పుడో విడుద‌ల కావ‌ల‌సి ఉన్నా, ప‌లు కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డుతూ వ‌స్తుంది. ఇక సుంద‌ర్ క‌ల‌ల ప్రాజెక్ట్ ‘సంఘ‌మిత్ర’ చిత్రంలో ముందుగా శృతిని క‌థానాయిక‌గా సెల‌క్ట్ చేయ‌గా, ఈ అమ్మ‌డు మిడిల్‌లోనే ఆ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకుంది. దీంతో ఆమె స్థానంలో దిశా ప‌ఠానీని తీసుకున్నారు. అయితే సినిమాల‌లో న‌టించేందుకు చాలా గ్యాప్ తీసుకున్న శృతి హాస‌న్ రీసెంట్‌గా ఓ బాలీవుడ్ చిత్రానికి సైన్ చేసింది

శృతి హాస‌న్ తాజా చిత్రం మ‌హేష్ మంజ్రేక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతుంది. శుక్ర‌వారం సెట్స్ పైకి వెళ్ళిన ఈ చిత్రం గ్యాంగ్‌స్ట‌ర్ నేప‌థ్యంలో ఉంటుంద‌ని టాక్‌. శృతికి జోడిగా విద్యుత్ జ‌మ్వాల్ న‌టిస్తున్నారు. విజయ్‌ గలానీ, ప్రతీక్‌ గలానీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏడాది చివ‌రిలో రిలీజ్ కానున్న‌ట్టు స‌మాచారం.