తమన్నాను అంత తేలిగ్గా వదులుకోను !

తమన్నా, శృతి హాసన్‌ల మధ్య మంచి స్నేహం ఉన్న సంగతి అందరికి తెలిసిందే. ఏ మాత్రం అవకాశం వచ్చినా ఇద్దరు ఒకరి మీద ఒకరు ప్రశంసలు కురిపించుకుంటారు. తాజాగా జరిగిన ఓ సంఘటన వీరిద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని మరో సారి చాటింది. ఓ చిట్‌చాట్‌ కార్యక్రమానికి హాజరైన శృతి హాసన్‌ను హోస్ట్‌ ‘ఒక వేళ మీరు అబ్బాయి ఐతే ఏ హీరోయిన్‌తో డేట్‌కు వెళ్తార’ని ప్రశ్నించారు.’తాను అబ్బాయిగా పుట్టుంటే మిల్కీ బ్యూటీ తమన్నానే పెళ్లి చేసుకునేదాన్న’ని అంటోంది  శ్రుతి హాసన్‌. శ్రుతి తనకు తమన్నాతో ఉన్న అనుబంధం గురించి వివరించింది….
‘నేను అబ్బాయిని అయివుంటే.. తమన్నాను డేటింగ్‌కు తీసుకెళ్లేదాన్ని. అంతేకాదు పెళ్లి కూడా చేసుకునేదాన్ని. తమన్నా చాలా మంచి అమ్మాయి. తనను అంత తేలిగ్గా వదులుకోను’ అన్నారు. పార్టీలకు కూడా వీరిద్దరూ అప్పుడప్పుడూ కలిసే వెళుతుంటారు. ఓసారి పార్టీలో తమన్నా, శ్రుతి లిప్‌కిస్‌ చేసుకున్నారని వార్తలు బయటికి వచ్చాయి. దీనిపై అప్పట్లో తమన్నా స్పందిస్తూ.. ‘మొన్నటివరకు నాకు అబ్బాయిలతో లింక్‌ పెట్టారు. ఇప్పుడు అమ్మాయితో లింక్‌ పెడుతున్నారా? అసలు మా ఇద్దరి గురించి ఆ తప్పుడు వార్త ఎలా బయటికొచ్చిందో కూడా అర్ధంకావడంలేదు’ అన్నారు. ‘కాటమరాయుడు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రుతి ఆ తర్వాత తన తదుపరి సినిమాను ప్రకటించలేదు. ‘హలో సాగో’ అనే తమిళ సెలబ్రిటీ చాట్‌షోకు శ్రుతి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.
 
నేను కోరుకునేది ఎంటర్‌టెయిన్‌మెంట్‌నే !
శ్రుతిహాసన్‌ ఓ కళాశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు శ్రుతిహాసన్‌ సూటిగా బదులిచ్చింది.  మీకు నచ్చిన చిత్రం ఏమిటన్న ప్రశ్నకు… ‘మహానది’ అని చెప్పింది. ఇది శ్రుతి తండ్రి కమలహాసన్‌ నటించిన చిత్రం. ఉత్తమ నటుడు కమలహసన్‌ అని చెప్పింది. సినీరంగంలో మీరు కోరుకునేది? అన్న ప్రశ్నకు… తాను నటిగా, గాయనిగా, సంగీతదర్శకురాలి పేరు తెచ్చుకున్నా, వీటన్నింటిలోనూ తాను కోరుకునేది ఎంటర్‌టెయిన్‌మెంట్‌నేనని చెప్పింది. మీరు తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటించారు. అందులో ఏ చిత్ర పరిశ్రమ నచ్చింది? అనే ప్రశ్నకు తాను ఏ భాషలో పని చేసినా నటననే ఇష్టపడి చేస్తానని చెప్పింది. నటుడు అజిత్‌ గురించి మీ అభిప్రాయం అన్న ప్రశ్నకు… తనకు బాగా ఇష్టమైన నటుల్లో అజిత్‌ ఒకరని చెప్పింది. సంప్రదాయమైన నటుడు అజిత్‌ అని శ్రుతిహాసన్‌ చెప్పింది. శ్రుతిహాసన్‌ అజిత్‌తో ‘వేదాళం’ చిత్రంలో నటించింది.