నిర్మాతగా మల్టీ లాంగ్వేజ్‌ చిత్రాలు తీస్తా !

”నాలోని క్రియేటివిటీని ప్రపంచానికి పరిచయం చేసే పనిలో ఉన్నాను. అందులో భాగంగా ప్రస్తుతం స్క్రిప్ట్‌ రైటింగ్‌పై దృష్టి పెట్టాను  . నేను రాసే మొదటి స్క్రిప్ట్‌ను ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేస్తాను. ఈ ఏడాది చివరికల్లా ఓ సినిమాకి స్క్రిప్ట్‌ రాయడమే నా ప్రస్తుత లక్ష్యం’ అని అంటోంది శ్రుతి హాసన్‌. సింగర్‌గా, నటిగా, సంగీత దర్శకురాలిగా .. మంచి గుర్తింపు పొందిన శ్రుతి త్వరలోనే స్క్రిప్ట్‌ రైటర్‌గా ప్రేక్షకులకు పరిచయం కానుంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆ విశేషాలను శ్రుతి తెలియజేస్తూ…
కేవలం స్క్రిప్ట్‌ రైటర్‌గానే కాకుండా నిర్మాతగా మారి తక్కువ బడ్జెట్‌లో మల్టీ లాంగ్వేజ్‌ చిత్రాలను కూడా నిర్మించాలనుకుంటున్నాను. అయితే ఈ చిత్రాలకు నేను దర్శకత్వం వహించను. కేవలం నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తాను’ అని తెలిపింది. ప్రస్తుతం కమల్‌హాసన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తెలుగు, తమిళం, హిందీ భాషా చిత్రం ‘శభాష్‌ నాయుడు’లో  ఓ హిందీ చిత్రం లో శృతి  చేస్తోంది .  సి. సుందర్ దర్శకత్వం లో ‘సంఘమిత్ర’ గా చేసేందుకు అంగీకరించిన శృతి, ఆ తర్వాత అందునుంచి తప్పుకుంది