అవుంటే చాలు.. జీవితాంతం హ్యాపీగా బతికేయొచ్చు !

“వంట చేయడం నాకు చాలా ఇష్టం! నేను చేసిన వంటను నలుగురికి తినిపించడం ఇంకా ఇష్టం!  ఓ సౌత్ ఇండియన్ రెస్టారెంట్ నాకు ఉంటే బాగుంటుందని ఎప్పుడూ అనుకుంటాను. ఆ రెస్టారెంట్ కూడా ముంబయిలో ఉండాలి. అందులో తమిళ సాంబార్, ఆంధ్రా పప్పు ఉంటే చాలు. జీవితాంతం హ్యాపీ గా  బతికేయొచ్చు”… అంటూ  తన మనసులో మాటను బయటపెట్టింది శృతిహాసన్. శృతిహాసన్ కు ఓ కల ఉంది. ఎప్పటికైనా పెద్ద సింగర్ గా మారి.. తన మ్యూజికల్ బ్యాండ్ ను స్టార్ ను చేయాలనేది ఆమె కల.  శృతిహాసన్ కు మరో చిలిపి కోరిక కూడా ఉంది. నిత్యం ముంబయిలో ఉంటూ సౌతిండియా భోజనాన్ని మిస్ అవుతున్న శృతి… ముంబయిలో తన టేస్ట్ కు తగ్గట్టు సౌతిండియా రెస్టారెంట్ ఒకటి పెట్టాలన్నది శృతిహాసన్ కోరిక అంట.

ప్రభాస్ గుర్తొస్తున్నాడట!… శృతిహాసన్ కు ఈ మధ్య కాలంలో భోజనం అంటే చాలు.. ప్రభాస్ గుర్తొస్తున్నాడట…”సలార్’ షూట్ లో ఉన్నప్పుడు ప్రభాస్ నాకు భోజనం పంపిస్తానన్నాడు. భోజనమే కదా ఓకే! అన్నాను. ఏకంగా 40 వెరైటీలు పంపించాడు. అవన్నీ నేను తినలేకపోయాను. కొంచెం కొంచెం గా అన్నీ టేస్ట్ చేశాను. చాలా బాగున్నాయి. ఈసారి ఇంకొన్ని వెరైటీలు పంపిస్తానన్నాడు. వద్దని చెప్పాను. ఎందుకంటే? నేను ఎక్కువ తినను. 2-3 రకాలు చాలు నాకు. సరే ఈసారి డెజర్ట్ పంపిస్తానని చెప్పి, 3 సంచుల నిండా పంపించాడు”….ఇలా ప్రభాస్ తో తన ఫుడ్ ఎక్స్ పీరియన్స్ ను పంచుకుంది శృతిహాసన్. ప్రభాస్ కు భోజనం తినడమే కాదు, నలుగురికి పెట్టడం చాలా ఇష్టమని, అది అతడి కుటుంబ వారసత్వమని చెబుతోంది శృతిహాసన్.

అమెజాన్ ప్రైమ్ లో వెబ్ సిరీస్!… లాక్ డౌన్ పుణ్యమా అని ఓటీటీ  లకు బాగానే క్రేజ్ పెరిగింది. థియేటర్లు రీ ఓపెన్ అయినప్పటికీ  ప్రేక్షకులు ఇంట్లో కూర్చుని ఓటీటీలో సినిమాలు చూడటానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో అందరూ ఓటీటీ లపై కన్నేశారు. ఇప్పటికే పలు స్టార్ నటులు వెబ్ సిరీస్ చేయడానికి ముందుకు వచ్చారు. హీరోయిన్లు సైతం మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే వెబ్ సిరీస్ చేస్తున్న స్టార్ హీరోయిన్ల జాబితాలో సమంత కాజల్ వంటి హీరోయిన్ లతో శృతిహాసన్ పేరు కూడా చేరిపోయింది.

‘క్రాక్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శ్రుతి మళ్లీ తన హవా కొనసాగిస్తోంది. ప్రస్తుతం శ్రుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘సలార్’ లో నటిస్తోంది. అటు సినిమాల్లో నటిస్తూనే.. ఏమాత్రం తీరిక దొరికినా సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.  ఇటీవల నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ‘పిట్ట కథలు’ వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ ప్లాట్‏ఫాంలోకి ఎంట్రీ ఇచ్చి.. సూపర్ హిట్ అందుకుంది శ్రుతి హాసన్. ఈ సిరీస్ తర్వాత మళ్లీ డిజిటల్ ఫ్లాట్‏ఫాంపై శ్రుతి కనిపించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా శ్రుతి హాసన్ ఓ హిందీ వెబ్ సిరీస్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ తో భారీ ఢీల్ కుదుర్చుకుందట. ఇటీవల ఓ ఇంటర్య్యులో శ్రుతి హాసన్.. ఆమెజాన్ సంస్థతో కుదుర్చున్న ఒప్పందం గురించి చెప్పుకొచ్చింది.

అతను నాకు పర్‏ఫెక్ట్ మ్యాచ్!… శ్రుతి హాసన్ గత కొద్ది కాలం సినిమాలకు దూరంగా ఉన్నా … ఇటీవల ‘క్రాక్’ తో మళ్లీ ఫాంలోకి వచ్చి.. మళ్లీ దూసుకుపోతోంది. అటు పాన్ ఇండియా లెవల్ చిత్రాలలో అవకాశాలను అందుకోవడమే కాకుండా.. వెబ్ సిరీస్ ఆఫర్లను కూడా అందుకుంటూ బిజీ అవుతుంది. ఇక ఇటీవల ప్రేమ, పెళ్లి గురించి  క్లారిటీ ఇచ్చిన శ్రుతి హాసన్…  శంతను హజారికతో ఉన్న రిలేషన్ పై కూడా క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. “ఇద్దరి అభిరుచులు ఒకటే. కళలు, సంగీతం పట్ల అవగాహన ఉంది. అందుకే అతనితో ఎక్కువ సమయం గడిపడానికి ఇష్టపడతాను. అన్ని అంశాల్లోనూ అతను నాకు పర్‏ఫెక్ట్ మ్యాచ్” అంటూ చెప్పుకొచ్చింది శ్రుతి హాసన్.