హీరో కన్నా ఆమెకు డబుల్ రెమ్యునరేషన్

శృతిహాసన్… పవన్‌కళ్యాణ్ చిత్రం ‘గబ్బర్‌సింగ్’లో నటించిన తర్వాత ఈ భామ కెరీర్ పూర్తిగా మారిపోయింది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మారింది. కానీ గత రెండేళ్లలో మళ్లీ ఫ్లాపులతో శృతికి సినిమా అవకాశాలు తగ్గాయి. బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ కోర్సలేతో ప్రేమ వ్యవహారం కూడా ముదిరి పాకాన పడడంతోనే ఆమె సినిమాలకు దూరమైందనే టాక్ కూడా ఉంది. తాజాగా శృతిహాసన్ ఒక హిందీ సినిమాకు సైన్ చేసింది. ‘ఠాకూర్ దేవదాస్’ అనే టైటిల్‌తో తెరకెక్కే ఈ సినిమాలో విద్యుత్ జమ్వాల్ హీరోగా నటిస్తున్నాడు. నసీరుద్దీన్ షా, అమోల్ పాలేకర్ ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
 
అయితే ఈ సినిమాలో హీరో విద్యుత్ కంటే శృతి డబుల్ రెమ్యునరేషన్ తీసుకుంటోందట. అంతేకాదు ఈ సినిమాకు పేమెంట్‌ను డెయిలీ బేసిస్‌లో అడ్వాన్సుగా తీసుకుంటోందని తెలిసింది. తన మేనేజర్ అడ్వాన్సు ముట్టిందని చెబితేనే ఆ రోజు షూటింగ్‌లో పాల్గొంటోందట. శృతి వాలకం చూస్తుంటే ముక్కు పిండి మరీ నిర్మాతల దగ్గర డబ్బు వసూలు చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. ప్రస్తుతం శృతిహాసన్ ఈ ఒక్క సినిమాలోనే నటిస్తోంది. 
పెళ్లి చేసుకొని సెటిలయ్యే ఆలోచన
‘సింగం3’లో సూర్యకు జోడీగా నటించిన శ్రుతిహాసన్‌ కెరీర్‌ను ఎంచుకునే విషయంలో చాలా సెలక్టివ్‌గా ఉంది. ప్రస్తుతం కోలీవుడ్‌లో అవకాశాలు పెద్దగా లేకపోవడంతో తనలోని గాయనికి పని పెట్టింది. ప్రస్తుతం విదేశాల్లో జరిగే మ్యూజిక్‌ ఈవెంట్స్‌లో పాల్గొంటోంది. ఇందుకోసం తన సంగీత బృందంతో చెన్నై, ముంబై, లండన్‌ల మధ్య విస్తృతంగా ప్రయాణాలు చేస్తోందని ఇండస్ట్రీ టాక్‌. నూతన సంవత్సర వేడుకలను కూడా తన బాయ్‌ఫ్రెండ్‌ మెఖేల్‌ కొర్సెల్‌తో కలిసి జరుపుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. అయితే ఇంతకాలం సినిమాల్లో ఏదో సాధించాలని అనుకున్న శ్రుతికి బాలీవుడ్‌ సినిమాలు తప్ప, తమిళంలో పెద్దగా ఆఫర్లు కూడా లేకపోవడంతో తన ప్రియుడిని పెళ్లి చేసుకొని జీవితంలో సెటిలయ్యే ఆలోచనలో ఉంది. అందులో భాగంగానే ఇరువర్గాల పెద్దల సమ్మతితో ఈ సంవత్సరంలోనే శ్రుతి-మైఖేల్‌లు పెళ్లి చేసుకోబోతున్నారని సినీ పరిశ్రమలో వార్తలు వినిపిస్తున్నాయి.