నేనెలా జీవించాలి అనుకుంటానో.. అలానే జీవిస్తాను!

“ఒకరి జీవితం గురించి వేరేవారు నిర్ణయించలేరు. ఇది నా జీవితం.. నా ముఖం. ఈ విషయం చెప్పడం సంతోషంగా ఉంది”… అంటూ తన ప్లాస్టిక్ సర్జరీ గురించి చెప్పింది శృతి హాసన్ . సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఆమె త‌న ఫోటోస్‌ రెగ్యుల‌ర్‌గా పోస్ట్ చేస్తూ ఉంటుంది. శ్రుతి హాసన్ ఒకప్పుడు ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె మళ్లీ సర్జరీ చేయించుకుంది . ఇదివరకు ఆమెకు ఉన్న ముక్కుతో పోలిస్తే.. ఇప్పుడు కాస్త సన్నబడినట్లుగా కనిపిస్తోంది.శ్రుతి ముక్కుకు మాత్రమే కాదు పెదాలకు కూడా బొటాక్స్ చేయించుకుంది. దాంతో అవి లావుగా అందంగా కనిపిస్తున్నాయి. అయితే ఆమె చాలా సన్నబడిపోయారు. దాంతో శ్రుతికి ఏమైంది? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ సారి ధైర్యంగా తాను ఎందుకు సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా శ్రుతి హాసన్ చెప్పింది. నెటిజ‌న్స్ కామెంట్స్‌పై శృతి ఘాటుగా స్పందించింది. గ‌తంలో తాను ప్లాస్టిక్ స‌ర్జ‌రీ చేయించుకున్న విష‌యాన్ని కూడా ఒప్పుకుంది.
 
“నేను ఈ పోస్ట్‌ పెట్టడం వెనుక అర్ధం ఉంది. ఒకరి అభిప్రాయాలకి తగ్గట్టు నడుచుకోవలసిన అవసరం నాకు లేదు. ‘చాలా సన్నగా ఉంది’ అంటూ చాలా మంది కామెంట్స్ చేసారు. ఇకపై ఈ కామెంట్స్‌ సహించబోను. నేను ఇప్పుడు పోస్ట్ చేసిన ఫొటోలు మూడు రోజుల గ్యాప్ లో తీసినవి. నేను చెప్పబోయే విషయం గురించి ఇతర ఆడవాళ్లు కూడా ఫీలవుతారని అనుకుంటున్నా. నాకు మెంటల్‌గా ఫిజికల్‌గా హార్మోనల్ సమస్యలు ఉన్నాయి. ఎన్నో ఏళ్ల పాటు నా హార్మోన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఆ బాధ భరించడం అంత సులువు కాదు, శారీరకంగా జరిగే మార్పులను తట్టుకోవడం అంత తేలిక కాదు. ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతగానో కష్టపడుతున్నాను. శారీరక మార్పుల వెనుక కష్టం మాములుగా ఉండదు. ఒకరి జీవితం గురించి వేరేవారు నిర్ణయించలేరు. ఇది నా జీవితం.. నా ముఖం. ఈ విషయం చెప్పడం సంతోషంగా ఉంది. గతంలో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను. ఈ విషయం ఎప్పుడైనా చెప్పానా ? ఇలాంటివి చెప్పుకోవడం నాకిష్టం ఉండదు. నేను ప్లాస్టిక్ సర్జరీలను సపోర్ట్ చేయడంలేదు. అలాగని వాటికి వ్యతిరేకిని కూడా కాదు. ‘మనం ఎలా బతకాలని అనుకుంటున్నాం’ అన్నదే ముఖ్యం. మన శరీరాల్లో, ఆలోచనల్లో వచ్చే మార్పులను స్వీకరించగలిగినప్పుడే మనకు మనం సాయం చేసుకున్నవాళ్లం అవుతాం.మనకు మనం చేసుకునే మంచి ఏదైనా ఉంది అంటే, మన ఆలోచనా విధానంలో మార్పు తెచ్చుకోవడమే. ‘ప్రేమను పంచండి’. రోజూ నన్ను నేను కాస్త ఎక్కువ ప్రేమించుకోవడమే నా జీవితంలో గొప్ప ప్రేమ కథ. మీ జీవితం కూడా అంతేనని ఆశిస్తున్నాను’’ అని శృతి త‌న పోస్ట్‌లో పేర్కొంది. ‘క్రాక్‌’తో పాటు ‘దేవి’, ‘లాభం’ అనే త‌మిళ చిత్రాల‌తో ప్ర‌స్తుతం బిజీగా ఉంది శృతి.