ఒక వ్యక్తిగా, నటిగా చాలా మారిపోయాను !

శ్రుతి హసన్‌ సినిమా ఇండిస్టీలో కథానాయికగా అడుగు పెట్టి 10 ఏళ్లు పూర్తయింది. ఓ దశలో సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ సేమ్‌ మ్యాజిక్‌ను రిపీట్‌ చేయడానికి అప్పుడప్పుడు హిందీ సినిమాలు చేస్తోంది. తెలుగులో ‘కాటమరాయుడు’ ఈమె చివరి సినిమా. ఆ తర్వాత తనకు వ్యక్తిగతం ఇష్టమైన సంగీత రంగంలోకి ప్రవేశించింది. ఆల్బ్‌మ్స్‌ రూపొందించే పనుల్లో ఇప్పుడు బిజీగా ఉంది. తన సినీ కెరీర్‌ పదేళ్ల కాలంలో చాలా నేర్చుకున్నానని పేర్కొంది శ్రతి…
”నేను నటిగా సినిమా రంగంలోకి వచ్చి 10 ఏళ్ల పూర్తయింది. ఈ కాలంలో చాలా నేర్చుకున్నా. ‘‘నేను మారిపోయా’’ అని అంటోంది శ్రుతీహాసన్‌.మీ అందరి దీవెనల వల్లే ఈ రోజు ఈ స్థాయిలో ఉండగలిగా. నేను కష్టపడి పని చేస్తానని మీకు ప్రమాణం చేస్తున్నా. నన్ను సపోర్టు చేస్తున్న వారంతా గర్వపడేలా ఇంకా మెరుగ్గా చేస్తా. ఒక వ్యక్తిగా, నటిగా చాలా మారాను.ఈ జర్నీలో ‘మూవీ బిజినెస్‌’ అనేది నాకు ఫ్యామిలీ లాంటిదని అర్థమైంది.ఇక్కడ కొన్ని మంచి విషయాలు ఉన్నాయి. మరికొన్ని చెడు సంగతులున్నాయి. ఈ పదేళ్ల ప్రయాణంలో వృత్తిపరంగా, వ్యక్తిగా నేను చాలా మారిపోయాను. ఈ మధ్య ఒక ఏడాది విరామం తీసుకుని, వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎలా అడుగులు వేయాలో విశ్లేషించుకున్నాను. కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నాను. నా జీవితంలోని తర్వాతి దశకు చేరుకోవడంలో ఈ లక్ష్యాలు నాకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను.రాబోయే ఆ దశ కోసం చాలా ఎక్సైట్‌ అవుతున్నా” అని పేర్కొంది శృతి హాసన్‌.
 
‘ట్రెడ్ స్టోన్’లో నటించే ఛాన్స్‌ !
హాలీవుడ్‌లో స్థాయిలో ప్రియాంక చోప్రా అంటే గుర్తొచ్చేది ‘క్వాంటికో’ టీవీ సిరీస్‌. ఈ ప్రోగ్రామ్‌ ఆమెను హాలీవుడ్‌ నటిని చేసింది. అమెరికాకు కోడలిని చేసింది. ఇప్పుడు ఈమె మార్గంలోనే కథానాయిక శ్రుతి హాసన్‌ వెళుతుందనిపిస్తుంది. ఓ ఫ్యాషన్‌ వీక్‌ కార్యక్రమంలో పాల్గొన్న ప్రియాంక అమెరికన్‌ టీవీ చానల్‌లో అవకాశాన్ని కొట్టేసింది. అలాగే ఇప్పుడు శ్రుతి హాసన్‌ ఈనెల 20న ‘జీక్యూ అమెరికా’లో ‘100 బెస్ట్‌ డ్రెస్డ్‌ పీపుల్‌’ కార్యక్రమంలో పాల్గొని అందరూ చూపును ఆమె వైపు తిప్పుకుంది. అక్కడ అమెరికన్‌ టీవీ సిరీస్‌ ‘ట్రెడ్ స్టోన్’లో నటించే ఛాన్స్‌ను కొట్టేసింది. ఇది ‘జాన్‌సన్‌ బౌర్నే ఫిల్మ్‌ సిరీస్‌’ ఆధారంగా రూపొందుతోంది. ఈ సిరీస్‌లో ఇర్వైన్‌, బ్రైయిన్‌ జె. స్మిత్‌, మైఖల్‌ ప్రోర్బ్స్‌, పాట్రిక్‌ ఫుగిట్‌, మైఖల్‌ గ్యాస్టోన్‌, తెసే హ్యూబ్‌ రిచ్‌ తదితరులు నటిస్తున్నారు.