సిద్ధార్ద్ -కేదరిన్ ‘వ‌ద‌ల‌డు’ టీజ‌ర్ విడుద‌ల‌

టి.అంజ‌య్య స‌మ‌ర్పిస్తున్న చిత్రం ‘వ‌ద‌ల‌డు’.పారిజాత మూవీ క్రియేష‌న్స్‌, ట్రైడెంట్ ఆర్ట్స్ ప‌తాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి టి. న‌రేష్‌కుమార్‌, టి.శ్రీ‌ధ‌ర్ నిర్మాత‌లు. సిద్ధార్ద్ హీరోగా, కేదరిన్ తెరెసా హీరొయిన్ గా  సాయిశేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించిన ఈ చిత్రం ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 11న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఈ చిత్ర టీజ‌ర్‌ను ప్రొడ్యూస‌ర్స్ సెక్టార్ చైర్మెన్ ఏలూరు సురేంద‌ర్‌రెడ్డి, ఫిల్మ్ ఛాంబ‌ర్ జాయింట్ సెక్ర‌ట‌రీ న‌ట్టికుమార్ ప్ర‌సాద్‌ల్యాబ్స్‌లో టీజ‌ర్‌ విడుద‌ల చేశారు.
 
సురేంద‌ర్‌రెడ్డి మాట్లాడుతూ…అంజ‌య్య‌గారు నాకు ప‌ది సంవ‌త్స‌రాల నుంచి ప‌రిచ‌యం ఆయ‌న‌కు సినిమాల మీద చాలా ప్యాష‌న్ ఉంది. మూవీ హిట్లు, ఫ‌ట్ల‌తో సంబంధం లేకుండా సినిమాలు నిర్మిస్తూ ఉంటారు అని అన్నారు.
 
అంజ‌య్య మాట్లాడుతూ… పారిజాత క్రియేష‌న్స్ ప‌తాకం స్థాపించి రెండు సంవ‌త్స‌రాల‌యింది. మా బ్యాన‌ర్‌లో ‘ ప్రేమ అంత ఈజీ కాదు’, ‘కిల్ల‌ర్’ త‌దిత‌ర‌ చిత్రాలు తీశాను. ‘కె.కె.’ చిత్రం తో మంచి పేరొచ్చింది. క‌మ‌ర్షియ‌ల్ గా ఆశించి సినిమాలు ఎప్పుడూ తియ్య‌లేదు. ప్ర‌తీ చిత్రం అంద‌రూ చూసేలా మంచి మూవీస్ తీశాము. ఇక‌పైన కూడా అలాంటి చిత్రాలే తీస్తాము. రియ‌ల్ ఎస్టేట్‌లో ఎదిగినట్లే.. సినిమాల్లో కూడా ఎద‌గాల‌ని కోరుకుంటున్నాను. ‘వ‌ద‌ల‌డు’ అక్టోబ‌ర్ 11న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నాం.. అన్నారు.
 
మరో నిర్మాత టి. శ్రీ‌ధ‌ర్ మాట్లాడుతూ… ఈ సంవ‌త్స‌రం ఇది నా నాలుగ‌వ సినిమా. ‘వ‌ద‌ల‌డు’ (దెయ్యం అయినా స‌రే) అనేది ట్యాగ్ లైన్‌. ఏదో ఒక సోష‌ల్ మెసేజ్‌తో చిత్రాల‌ను తీస్తున్నాము. ఇక ఈ సినిమా విష‌యానికి వ‌స్తే… ఈ స‌మాజాన్ని ముందుకు తీసుకువెళ్లాలంటే ప్ర‌ధానంగా యువత కార‌ణం. హీరోయిన్ హార‌ర్ సీన్స్ లో చాలా బాగా న‌టించింది…అన్నారు.
 
ఇంకో నిర్మాత టి. న‌రేష్ కుమార్ మాట్లాడుతూ… మేం మంచి కాన్సెప్ట్ చిత్రాల‌ను నిర్మించ‌డానికి ఈ రంగంలోకి వ‌చ్చి ఆ బాట‌లోనే ప్ర‌యాణిస్తున్నాము.. అన్నారు.