“సిద్ధు గాడి లవ్ స్టోరీ” ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ !

????????????????????????????????????
మహాన్, శృతి, మోహన సిద్ధి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “సిద్ధు గాడి లవ్ స్టోరీ”. ఈ సినిమాను బాలబ్రహ్మచారి సమర్పణలో శివ బ్రహ్మేంద్ర క్రియేషన్స్ బ్యానర్ పై సావిత్రమ్మ.సి. నిర్మిస్తున్నారు. రమేష్.సి. దర్శకత్వం వహిస్తున్నారు. వేణుగోపాల చారి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు “సిద్ధు గాడి లవ్ స్టోరీ” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో జరిగింది. ప్రముఖ దర్శకుడు వీఎన్ ఆదిత్య ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై “సిద్ధు గాడి లవ్ స్టోరీ” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా

డైరెక్టర్ వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ – డైరెక్టర్ కావాలనే తన కొడుకు రమేష్ కలను “సిద్ధు గాడి లవ్ స్టోరీ” సినిమాతో సావిత్రమ్మ గారు నిజం చేశారు. రమేష్ ను యూఎస్ లో కలిశాను. సినిమా మీద ప్యాషన్ ఉన్న వ్యక్తి ఆయన. అక్కడ తన ప్రొఫెషనల్ కెరీర్ కంటిన్యూ చేస్తూ ఇండియా వచ్చి ఈ సినిమా కంప్లీట్ చేశారు. సిద్ధు సిద్ధార్థ్ రాయ్ లవ్ స్టోరీని ఖుషి సినిమాలో చూసి హిట్ చేశాం. ఇప్పుడీ “సిద్ధు గాడి లవ్ స్టోరీ” ని కూడా అలాగే ప్రేక్షకులు హిట్ చేయాలని కోరుకుంటున్నా. మహాన్, శృతి, మోహన సిద్ధి ముగ్గురూ కొన్ని మూవీస్ చేశారు. ఈ సినిమా వీళ్లకు మంచి పేరు తీసుకురావాలి. అలాగే ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేస్తున్న సాంబశివరావు నాకు మంచి మిత్రుడు. “సిద్ధు గాడి లవ్ స్టోరీ” పాటలు చాలా  బాగున్నాయి. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో మహాన్ మాట్లాడుతూ – మా “సిద్ధు గాడి లవ్ స్టోరీ” సినిమాలో మంచి పాటలు, ఫైట్స్ ఉంటాయి. ఇందులో ప్రేమ కథతో పాటు మంచి సందేశం కూడా ఉంటుంది. ఇద్దరు హీరోయిన్స్ లో శృతి క్లాస్ ఆడియెన్స్ కు నచ్చితే, మోహన సిద్ధి మాస్ ఆడియెన్స్ కు నచ్చుతుంది. నా క్యారెక్టర్ ను మాత్రం ప్రేక్షకులంతా ఇష్టపడతారు. అన్నారు.

హీరోయిన్ మోహన సిద్ధి మాట్లాడుతూ – తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడం తక్కువ. నాకు “సిద్ధు గాడి లవ్ స్టోరీ” చిత్రంలో అవకాశం కల్పించిన డైరెక్టర్ రమేష్ గారికి థ్యాంక్స్. ఈ సినిమాలో నాకు సోలో సాంగ్ ఉంటుంది. ఆ పాట నేచర్ గురించి రూపొందించారు. హీరోయిన్ గా నాకు మంచి పేరు తెచ్చే మూవీ అవుతుందని నమ్ముతున్నాను. అన్నారు

హీరోయిన్ శృతి మాట్లాడుతూ – మా “సిద్ధు గాడి లవ్ స్టోరీ” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ చేయడానికి అతిథిగా వచ్చిన వీఎన్ ఆదిత్య గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. ఒక మంచి ప్రేమ కథా చిత్రంగా మా సినిమా మీ అందరి ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ అధిరవ్ కృష్ణ మాట్లాడుతూ –  “సిద్ధు గాడి లవ్ స్టోరీ” సినిమాలో సాంగ్స్ అన్నీ బాగా కుదిరాయి. మా మూవీ ఆల్బమ్ మంచి హిట్ అవుతుందని, అలాగే సినిమా కూడా ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటుందని నమ్ముతున్నాం. అన్నారు.

*నటీనటులు – మహాన్, శృతి, మోహన సిద్ధి, సుమన్, స్నేహ, ఆనంద్ భారతి, సర్కార్, అలీష, చిత్ర శ్రీను, చిట్టి బాబు, వైజాగ్ అప్పారావు, తదితరులు
ఎడిటర్ -లక్కీ ఈకరి
డీవోపీ – దోసడ యాదగిరి
మ్యూజిక్ – అధిరవ్ కృష్ణ
డైలాగ్స్ – మెండెం శ్రీధర్
లిరిక్స్ – మధు, స్వామి
కొరియోగ్రఫీ – రజని, సాగర్, రమేష్.సి
ప్రొడ్యూసర్ – సావిత్రమ్మ.సి.
రచన, దర్శకత్వం – రమేష్. సి.
పీఆర్ఓ – ఆర్ కె చౌదరి