15న శింబు, నయనతార ‘సరసుడు’

”చిన్న సినిమాకు కావాల్సింది బడ్జెట్‌ కాదు సబ్జెక్ట్‌. అదే ‘సరసుడు’ చిత్రంలో ఉంది. తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకంతో నైజం, సీడెడ్‌, ఆంధ్రాలో మా సంస్థ నుంచే విడుదల చేయనున్నాం’ అని దర్శక నిర్మాత టి.రాజేందర్‌ తెలిపారు. శింబు సినీ ఆర్ట్స్‌, జెసన్‌ రాజ్‌ ఫిలిమ్స్‌ పతాకాలపై టి.రాజేందర్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘సరసుడు’. శింబు, నయనతార జంటగా నటించారు.

ఈ నెల 15న విడుదల సందర్భంగా దర్శక నిర్మాత టి. రాజేందర్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు…..’తెలుగు ప్రేక్షకులంటే నాకు చాలా ప్రేమ. ఎందుకంటే నేను అందించిన ‘ప్రేమ సాగరం’ చిత్రాన్ని దాదాపు సంవత్సరం పాటు థియేటర్లలో ఆదరించారు. అంతే కాకుండా మా అబ్బాయి శింబు నటించిన ‘మన్మథ’, ‘వల్లభ’ చిత్రాలను కూడా ఆదరించారు. అదే నమ్మకంతో మరోసారి ‘సరసుడు’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాం. యూత్‌కు ఏం కావాలో అన్నీ ఇందులో ఉన్నాయి. ఆడియెన్స్‌ పల్స్‌ తెలుసుకొని పాటలకు లిరిక్స్‌ అందించాను” అని అన్నాడు.