ఆస్ట్రేలియా మెల్బోర్న్ లో ఆరవ ‘ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు’

ఆరవ ప్రపంచ తెలుగు సాహితీసదస్సు

Glen Waverley Community Centre, 700 Waverley Road GLEN WAVERLEY, VIC 3150
Melbourne, Australia
 
ఆస్ట్రేలియా లో మెల్బోర్న్ మహానగరంలో నవంబర్ 3-4, 2018 తారీకులలో
6వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు
 
 
#గత 26 సంవత్సరాలుగా   ఆస్ట్రేలియా ఖండంలో తెలుగు భాష, సంస్కృతి, సంగీత, నాట్య కళా రూపాలకి నిరుపమానమైన సేవలందిస్తున్న “ఆస్టేలియా తెలుగు సంఘం” (TeluguAssociation of Australia, Inc.), మెల్బోర్న్, ఆస్ట్రేలియా
 
#ప్రపంచ వ్యాప్తంగా గత 24 వత్సరాలుగా శతాధిక సాహితీ సదస్సులూ, సాహిత్య కార్యక్రమాల నిర్వహణ ద్వారా అపార అనుభవం గల “వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా”, హ్యూస్టన్ (అమెరికా) & హైదరాబాద్
 
#తెలుగు నాట మన భాషా సాహిత్యాల పురోగతికి అలుపెరగని కృషి చేస్తున్న సాహిత్య సంస్థ లోక్ నాయక్ ఫౌండేషన్, విశాఖపట్నం
 
ఈ మూడు సంస్థలే కాక ఆ ప్రాంతాలలో ఉన్న ఆస్ట్రేలియా తెలుగు సమాఖ్య, సింగపూర్, హాంగ్ కాంగ్, ఇండొనీషియా, మైన్మార్, థాయ్ లాండ్, బాలి, మలేసియా మొదలైన దేశాల లో ఉన్న తెలుగు సంస్థలు తమ సహకారం అందిస్తున్నారు.
 
సదస్సు ప్రధాన ఆశయాలు
1. ప్రపంచవ్యాప్తంగానూ, ముఖ్యంగా ఆస్ట్రేలియా మరియు దక్షిణ ఆసియా ఖండం లో ఉన్న దేశాలలో నివశిస్తున్న తెలుగు రచయితలూ, పండితులూ, సాహిత్యాభిమానులూ, కలుసుకుని తమ తెలుగు సాహిత్యాభిమానాన్నీ, తమ రచనలనీ సహ భాషాభిమానులతో, ఆత్మీయ వాతావరణంలో పంచుకునే వేదిక ని కల్పించడం.
2. తెలుగు సాహిత్యానికి ప్రపంచ వ్యాప్తంగానే కాక తెలుగు నాట కూడా తగిన గుర్తింపుకి ఆచరణ సాధ్యమైన ప్రణాళికల పై చర్చించడం.
3. తెలుగు భాషకీ, సంస్కృతికీ అనుసంధానమైన తెలుగు సృజనాత్మక సాహిత్యానికి పెద్ద పీట వేస్తూ ఆంగ్ల భాషా ప్రభావంలో రెప రెపలాడుతున్న మన సాహిత్యానికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం.
4. నిష్ణాతులైన సాహిత్య కారుల ఆహ్లాదకరమైన ప్రసంగాలు వినే అవకాశం కల్పించడం.
 
 
తెలుగు భాషాభిమానులందరూ ఈ మహాసభలకి ఆహ్వానితులే. ముఖ్యంగా స్థానిక రచయితలూ, సాహితీవేత్తలకీ ఈ 6వ ప్రపంచ సాహితీ సదస్సు ఒక ప్రత్యేక వేదిక. ప్రవేశ రుసుము లేని ఈ ప్రతిష్టాత్మక 6వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు ప్రతినిధులుగా రాదల్చుకున్న వారు ఈ క్రింది వారిని సంప్రదించండి. ఏ దేశం నుంచి అయినా ప్రతినిధుల, వక్తల ఖర్చులకు సదస్సు నిర్వాహకులకు బాధ్యత లేదు. సదస్సు పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించ బడతాయి.
 
సదస్సు సంచాలకులు
 
Sreeni Katta (President, Telugu Association of Australia, Melbourne)
 
Phone 61 413 398 940, E-mail: sreenik2004@yahoo.com.au
 
Dr. Vanguri Chitten Raju (Vanguri Foundation of America)
 
Phone: (1) 832 594 9054, E-mail: vangurifoundation@gmail.com
 
ప్రధాన సమన్వయ కర్త: Rao Konchada
 
Phone: 61 422 116 542, E-mail: rao.konchada@gmail.com
 
భారత దేశ సమన్వయ కర్త: Dr. Vamsee Ramaraju
 
Phone: (91) 98490 23852, E-mail:ramarajuvamsee@yahoo.co.in