సోషల్ మీడియాలో బోల్డ్ అండ్ బ్యూటిఫుల్‌ శోభిత

తెలుగమ్మాయిలు మోడలింగ్, సినిమా రంగాల్లో రాణించడం చాలా అరుదు. ఒక వేళ అడుగుపెట్టినా, నిలదొక్కుకోడానికి చాలా టైమ్ పడుతుంది. కానీ శోభితా ధూళిపాళ మాత్రం మోడలింగ్ రంగంలో తళుక్కున మెరిసి.. మిస్ ఫెమీనా, 2013లో ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ టైటిల్‌ కూడా సంపాదించింది. ఆ టైటిల్‌ ఇచ్చిన ఉత్సాహంతో 2014లో కింగ్‌ఫిషర్‌ క్యాలెండర్‌లో బికినీతో కనిపించి మోడలింగ్‌లో సెన్సేషనల్‌ స్టార్‌ అయింది.నేషనల్ వైడ్‌గా పేరు తెచ్చుకుంది. ఆ క్రేజ్‌తో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. కింగ్‌ఫిషర్‌ క్యాలెండర్‌లో కనిపించాక శోభిత చాలా మేగజైన్స్‌లో వరుసగా కవర్‌పేజీలపై దర్శనమిచ్చింది. ఆ సమయంలోనే ఇండియాలో పాపులర్‌ డైరెక్టర్స్‌లో ఒకరైన అనురాగ్‌ కశ్యప్‌ తన ‘రమణ్‌ రాఘవ్‌ 2.0’ సినిమాలో శోభితికు హీరోయిన్‌ అవకాశం ఇచ్చాడు. ఆ సినిమాకు మంచి రివ్యూలు వచ్చాయి. శోభితకూ సూపర్‌ పాపులారిటీ వచ్చింది. ఈ సినిమాలోనే ఆమె న్యూడ్‌గా కనిపించి ఆశ్చర్యపరిచింది. 
‘రామన్ రాఘవ్ 2.0, కాలాకాండీ’ చిత్రాలలో తన గ్లామర్‌తో బాలీవుడ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న శోభితా ధూళిపాళ.తెలుగులో ‘గూఢచారి’ చిత్రంలోనూ  చెలరేగింది. ఆ సినిమా హిట్ అయినా తెలుగులో అమ్మడిని అంతగా అవకాశాలు పలకరించ లేదు. ప్రస్తుతం వివిధ భాషల్లో కథానాయికగా నటిస్తూనే.. సోషల్ మీడియాలో అందాలారబోస్తోంది శోభితా. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్‌గా ఉన్న ఆమె పోజ్‌లకు నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు.
ఓ తెలుగమ్మాయి ఈ స్థాయిలో సోషల్ మీడియాలో గ్లామర్‌ను ఒలికించటం అరుదే. తెలుగుతో పాటు రెండు హిందీ చిత్రాల్లో నటిస్తోన్న శోభితా ‘మూథన్‌’ పేరుతో తెరకెక్కుతోన్న మలయాళ సినిమాలో నివిన్‌ పాలీ తో చేస్తోంది. పాత్ర కోసం ఎలాంటి సాహసాలు చెయ్యడానికి వెనుకాడనని చెబుతోంది. అన్ని రకాల పాత్రలు చేసి మెప్పించడం ఇష్టమని అంటోంది.