‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ సక్సెస్ మీట్

‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ సక్సెస్ మీట్ లో.. సుడిగాలి సుధీర్‌, ధన్య బాలకృష్ణ, నిర్మాత శేఖర్‌ రాజు, సంగీత దర్శకుడు భీమ్స్, పాటల రచయిత సురేష్ ఉపాధ్యాయ, డిస్ట్రిబ్యూటర్ పేపర్ సత్యనారాయణ పాల్గొన్నారు..సుడిగాలి సుధీర్‌, ధన్య బాలకృష్ణ హీరో హీరోయిన్స్ గా.. రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శక‌త్వంలో శేఖర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ బేనర్‌పై సాఫ్ట్‌వేర్‌ శేఖర్‌ రాజు నిర్మించారు.
ఈ చిత్రం విడుదలై పాజిటివ్ టాక్‌ తో మంచి కలెక్షన్స్ సాధిస్తోంది.
 
‘సుడిగాలి’ సుధీర్ మాట్లాడుతూ – ” వారానికి మూడు రోజులు ఇంట్లో టీవి ఆన్ చేస్తే కనిపిస్తాను. అలాంటిది నా కోసం టికెట్ కొనుక్కొని థియేటర్స్ కి వెళ్లి సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వెండితెర మీద రెండు గంటల క్యారెక్టర్ చేస్తానని నా లైఫ్ లో ఊహించలేదు. అది ఈరోజు నిజమైంది. మీ అందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను. సినిమా విడుదలై అంత‌టా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. మీ అందరికీ హృద‌య‌పూర్వ‌క‌ దన్యవాదాలు” అన్నారు.
 
సాప్ట్ వేర్ శేఖర్ రాజుగా మార్చుకున్నా!
శేఖర్ రాజు మాట్లాడుతూ – “నా మొదటి సినిమాను హిట్ చేసిన ప్రేక్షక దేవుళ్ళకి నేను ఎప్పటికి రుణపడి ఉంటాను. కథ నచ్చి డబ్బుతీసుకోకుండా నటించిన డా. శివ ప్రసాద్ గారికి ఈ సినిమా అంకిత‌మిస్తున్నాను. ‘ఇంకా థియేటర్స్ పెంచుతున్నాము’ అని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పారు. ఈ విజయానికి గుర్తుగా నా పేరుని ‘సాఫ్ట్ వేర్ శేఖర్ రాజు’ గా మార్చుకున్నాను” అన్నారు.
 
హీరోయిన్ ధన్యబాలకృష్ణ మాట్లాడుతూ – “ఈ సినిమా మామూలు ఓపెనింగ్స్ తెస్తుంది అనుకున్నాం కానీ, సుధీర్ ఫ్యాన్స్ దీనిని ఆడియన్స్ లోకి తీసుకెళ్లి.. ఒక పండుగలా పెద్ద ఓపెనింగ్స్ ఇచ్చారు. మౌత్ పబ్లిసిటీ తో సినిమా బాగా ఆడుతోంది . తెలుగు రాష్టాల్లోనే కాదు కర్ణాటకలో కూడా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఒక మంచి హిట్ తో సంతోషంగా ఉంది” అన్నారు.
 
మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మాట్లాడుతూ – ” ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ సినిమాలో ఒక పార్ట్ అయినందుకు గర్వంగా ఉంది. థియేటర్స్ కి వెళ్ళినప్పుడు ఆడియన్స్ చప్పట్లు విజిల్స్ తో ఒక పెద్దబహిరంగ సభలా అనిపించింది. నా పాట ఈ రోజు గెలిచింది అంటే.. ప్రధాన కారణం సుధీర్ గారు. సినిమా 200లో విడుదలైంది. ఇప్పుడు 300థియేటర్స్ లో ఆడుతుంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అయింది అనడానికి ఇదే ఉదాహరణ. ఇంత మంచి సినిమాని నిర్మించిన శేఖర్ రాజు గారికి, నా స్నేహితుడు రాజశేఖర్ కి కృతజ్ఞతలు. ఈ చిత్రంలో సురేష్ ఉపాధ్యాయ మూడు పాటలు రాశారు. ‘ఇంత అందమే’ పాట పెద్ద హిట్ అయింది. అతనికి మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నా” అన్నారు.
 
పాటల రచయిత సురేష్ ఉపాధ్యాయ మాట్లాడుతూ – ” ఈ సినిమాలో `ఇంత అందమే’,’కోయం బత్తూరు పీసు’, ‘ఐడెంటిటీ కార్డు” మూడు పాటలు రాశాను. అన్నీ పెద్ద హిట్ అయ్యాయి. సుధీర్ డ్యాన్స్ లు ఇరగదీశారు ” అన్నారు.