నా కెరీర్‌ మాత్రం నత్త నడక సాగుతోంది !

ఈ పదేండ్లలో నా కెరీర్‌ చాలా నెమ్మదిగా, నిలకడగా సాగింది’ అని చెబుతోంది సోనమ్‌ కపూర్‌.  ‘సావరియా’ చిత్రంతో బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది సోనమ్‌. ‘ఐ హేట్‌ లవ్‌స్టోరీస్‌’, ‘రాంజానా’, ‘భాగ్‌ మిల్కా భాగ్‌’, ఖుబ్సూరత్‌’, ‘ప్రేమ రతన్‌ ధన్‌ పాయో’, ‘నీర్జా’ వంటి విభిన్న కథా చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉంది.

పదేండ్ల జర్నీ గురించి సోనమ్‌ చెబుతూ…”ఈ ఏడాదితో నేను బాలీవుడ్‌ ఇండిస్టీలోకి అడుగుపెట్టి దశాబ్దం పూర్తయ్యింది. ఈ పదేండ్లలో మనిషిగా నేను చాలా పరిణతి సాధించాను. కానీ నా సినిమా కెరీర్‌ మాత్రం నత్త నడకగా సాగుతోంది. ఇక్కడ విజయాలు ముఖ్యం కాదు, మానవ సంబంధాలను సృష్టించుకోవడం, హార్డ్‌వర్క్‌ చేయడం ముఖ్యం. అదే సమయంలో మనకు ఏం కావాలో, ఏ విషయంలో పరిణతి చెందాలో ఆ విషయాల్లో మాత్రం ఇంప్రూవ్‌ అయ్యానని భావిస్తున్నా. ఇండిస్టీలో నాకు రామ్‌ మద్వానీ, ఆనంద్‌ ఎల్‌. రాయ్, స్వర భాస్కర్‌ బెస్ట్‌ ఫ్రెండ్స్‌. కొన్ని గొప్ప సంబంధాలు మనం ఇండిస్టీలో రాణించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఆర్‌.బాల్కీ, సంజయ్ లీలా భన్సాలీ, రాకేష్‌ ఓంప్రకాష్‌ మెహ్రా నాకు పేరెంట్స్‌లాగా ఉన్నారు.వారి సహకారంతో నేనెంతో రాణించగలిగాను. ఇదంతా ‘గిఫ్ట్‌ ఆఫ్‌ గాడ్‌’గా భావిస్తున్నాను’ అని తెలిపింది. సోనమ్‌ ప్రస్తుతం ‘ప్యాడ్‌మన్‌’తోపాటు సంజయ్ దత్‌ బయోపిక్‌లోనూ నటిస్తోంది.