క్రేజీ సినిమాలు : డేట్స్ సమస్యలు

అందం, అదృష్టంతో స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిన  కీర్తి సురేశ్, ప్రస్తుతం తెలుగులో పాటు తమిళంలోనూ క్రేజీ హీరోల సినిమాల్లో యాక్ట్ చేస్తోంది. తెలుగులో పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కొత్త సినిమా, కోలీవుడ్‌లో సూర్య మూవీలో యాక్ట్ చేస్తున్న ఈ అందాల చిన్నది అలనాటి మేటి నటి ‘సావిత్రి జీవిత చరిత్ర’ ఆధారంగా తెరకెక్కుతున్న ‘మహానటి’ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తోంది.రీసెంట్‌గా ప్రారంభమైన ‘పందెం కోడి’ సీక్వెల్‌లోనూ హీరోయిన్ ఛాన్స్ కీర్తి సురేశ్ కే దక్కింది.
ఇండస్ట్రీలోని వచ్చే ప్రతి అందాల భామ టాప్ హీరోయిన్ రేంజ్‎కు ఎదగాలనే కోరుకుంటుంది. కానీ కొద్దిమందికి మాత్రమే ఆ అదృష్టం దక్కుతుంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి సురేష్ నిర్మాతలకు  ఇబ్బందులు సృష్టిస్తోందట. ఇలా క్రేజీ ప్రాజెక్టులను తన సొంతం చేసుకుంటున్న కీర్తి సురేశ్, కొన్ని సినిమాలకు డేట్స్ అడ్జెస్ట్ చేయడంలో చాలా ఇబ్బంది పడుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కీర్తి సురేశ్ కారణంగా కొందరు హీరోలు తమ సినిమా షూటింగ్స్‌లో వెయిటింగ్‌లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందనే పుకార్లు కూడా షికారు చేస్తున్నాయి. అయితే ఈ విషయంలో తప్పంతా ఆమెదే అనే గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి.
మంచి అవకాశాలురావడంతో ఒకేసారి ఎక్కువ సినిమాలను ఒప్పుకోవడం వల్లే కేరళ కుట్టికి ఇలాంటి కష్టాలు ఎదురవుతున్నాయనే టాక్  ఉంది. చాలా తక్కువ టైమ్‌లోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిన కీర్తిసురేశ్, ఎక్కువ సినిమాలను ఖాతాలో వేసుకుని తాను ఇబ్బందిపడటంతో పాటు నిర్మాతలను కూడా టెన్షన్ పెడుతోంది.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మతో సినిమాలు చేస్తున్న కొందరు నిర్మాతలు ఈ విషయంలో ఆమెపై కోపంగా ఉన్నారట. కోటిన్నరకుపైగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న కీర్తి సురేష్, డేట్స్ అడ్జెస్ట్ చేయలేక తమను ఇబ్బందిపెడుతోందని అసహనం వ్యక్తం చేస్తున్నారట.