సాయి ప్ర‌కాష్ 100వ చిత్రం ‘శ్రీ‌స‌త్య‌సాయి అవ‌తారం’

క‌న్న‌డ‌, తెలుగు భాష‌ల్లో అంద‌రికీ తెలిసిన ద‌ర్శ‌కుడు సాయి ప్ర‌కాష్ ‘శ్రీ‌స‌త్య‌సాయి అవ‌తారం’ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం విశేష‌మైతే…  ఆయ‌న‌కిది 100వ చిత్రం కావ‌డం మ‌రో విశేషం. ఈ చిత్రాన్ని స్వామి భ‌క్తులు ప్ర‌ముఖ డాక్ట‌ర్ దామోద‌ర్ నిర్మిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా శ్రీ‌స‌త్య‌సాయి అవ‌తారం చిత్రంకు సంబంధించి లోగోను ముర‌ళీమోహ‌న్, సుమ‌న్‌, సి.క‌ళ్యాణ్‌ ఆవిష్క‌రించారు.

సాయి ప్ర‌కాష్ మాట్లాడుతూ…  ‘స‌బ్‌కామాలిక్ ఏక్ హై’ అనే వారు స్వామివారు. అలాంటి స్వామివారి సినిమా ఎలా తీస్తార‌నే సందేహం అంద‌రికీ క‌లిగింది. అన్ని కులాలు, మ‌తాలు ఒక్క‌టే అనేవారు. నా తండ్రిగారితో స్వామివారి గురించి చ‌ర్చించేవాడిని. నా తండ్రిగారు 1986లో కాలం చేశాక నా పేరున వున్న రెడ్డి తీసివేసి సాయి చేర్చుకుని జీవితం సాగించాను. అలా స‌త్య‌సాయి ద‌గ్గ‌ర‌కు నేను చేరాను. ప్ర‌తిరోజూ స్వామివారికి పాద న‌మ‌స్కారం చేసేవాడిని. ఓరోజు స్వామివారు న‌న్ను ఏం కావాలి? అని అడిగితే నాకు మీ  ప్రేమ కావాలి అనిచెప్పాను. ఆ త‌ర్వాత నా గురించి తెలుసుకుని షిరిడీ సాయి బాబా ద‌ర్శ‌నం కూడా చేయించి షిర్డిసాయిబాగా సినిమా చేయాల‌ని ఆశీర్వ‌దించారు. పుట్ట‌ప‌ర్తిలో షూటింగ్ చేయాలి అంటే.. అన్నీ వ‌స్తాయి అని న‌న్ను చేయ‌మ‌న్నారు. స్వామివారు ఆ సినిమా చూశారు. ఆ సినిమాను 108రోజుల పండ‌గ కూడా చేశారు. అలాటిది ఇప్పుడు ఆ స్వామివారిపై సినిమా చేసే భాగ్యం క‌లిగింది.ఈ క‌థ‌ను  1998లో తోట‌ప‌ల్లి మ‌ధుగారు రాశారు. ఆ త‌ర్వాత కోడిరామ‌కృష్ణ‌గారు చేప‌ట్టారు. కొన్ని కారణాల‌వ‌ల్ల సినిమా ఆగిపోయింది. ఇప్పుడు స్వామివారి ద‌య‌, భ‌క్తుల అనుగ్ర‌హంతో నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది.

స్వామివారిపై సినిమా తీస్తున్నాన‌ని ఓ సంద‌ర్భంలో డా. దామోద‌ర్‌గారికి పుట్ట‌ప‌ర్తిలో చెప్పాను. ఈ సినిమా నేనే నిర్మిస్తాన‌ని ముందుకు వ‌చ్చారు. ఈ సినిమాను రెండు భాగాలుగా తీయాల‌ని సంక‌ల్పించాం. బాల‌కాండ‌, మ‌హిమా కాండగా తీయ‌నున్నాం. ఇందులో 150 మంది క‌ళాకారులు న‌టించ‌నున్నారు. ద‌స‌రా త‌ర్వాత షూటింగ్ ప్రారంభిస్తాం. ఈ క‌థ‌కు భిక్ష‌ప‌తి అనువాదం చేస్తున్నారు.

చిత్ర నిర్మాత డా. దామోద‌ర్ మాట్లాడుతూ…  డాక్ట‌ర్‌గా స్వామివారి సేవ‌లో త‌రించాను. అనుకోకుండా స్వామి వారి పుట్టిన‌రోజున క‌లిసిన సాయిప్ర‌కాష్‌గారు మాట‌ల్లో స్వామివారి సినిమా గురించి చెప్పారు. వెంట‌నే నేనే చేస్తాను అన్నాను. అమెరికాలోని డాక్ట‌ర్లంతా నాకు స‌హ‌క‌రిస్తామ‌ని చెప్పారు. వంద సినిమాలు తీసిన ద‌ర్శ‌కుడిగా సాయిగారితో నేను సినిమా చేయ‌డం స్వామి మ‌హిమే అని తెలిపారు.

ముర‌ళీమోహ‌న్ మాట్లాడుతూ…  బాబాగారిపై ఎంతోమంది సినిమా చేయాల‌ని ప్ర‌య‌త్నించారు. అంజ‌లీదేవిగారు ఓసారి తీద్దామ‌నుకున్నారు. అందులోనేను బాబాగారి సోద‌రుడిగా న‌టించాను. అందుకు గ‌డ్డం వుంటే తీశాను. బాబాగారు 13 ఏళ్ళ‌వ‌ర‌కు క‌థ‌ను తీయ‌మ‌న్నారు. అప్ప‌ట్లో 15 ఎపిసోడ్లుగా వ‌చ్చింది. . నాకూ ఎన్నో అనుభ‌వాలు వున్నాయి. మొద‌ట్లో న‌మ్మ‌కంలేదు.  పైసా ఖ‌ర్చు లేకుండా చ‌దువు, ఆసుప‌త్రి సౌక‌ర్యాలు ఇవ్వ‌డం దేవుడికే సాధ్యం అని అనిపించింది. అప్పుడు నా మ‌న‌సు మారిపోయింది. అంజ‌లీదేవిగారు చెప్పిన ఎపిసోడ్ తీస్తున్న‌ప్పుడు నా భార్య‌తో స్వామివారిని క‌లిశాను. అప్పుడు ఆమెను చూసి దేనికైనా టైం రావాలి అనే వారు. అప్పుడు బాగారు ఇచ్చిన ఉంగ‌రం ఇప్ప‌టికే పెట్టుకుంటూనే వున్నానంటూ చూపించారు.

సుమ‌న్ మాట్లాడుతూ…  గాడ్ ఈజ్ గ్రేట్‌. భ‌గ‌వంతుడు ఏ నిర్ణ‌యం తీసుకుంటాడో మ‌న‌కెవ్వ‌రికీ తెలీదు. స‌మాజానికి త‌ప్ప‌కుండా తెలియాల్సిన ల‌వ్‌, ఎఫెక్ష‌న్‌, జీవితం అంటే ఏమిటి? అనే విష‌యాలు ఈ సినిమా చూపుతుంది. క‌రోనావ‌ల్ల మ‌న‌మంతా చాలా గుణ‌పాఠాలు నేర్చుకున్నాం. ఆప్తులెవ‌రో, అయిన‌వారెవ‌రో, స్నేహితులెవ‌రో మ‌న‌కు తెలియ‌జెప్పింది. బాబాగారి గురించి అద్భుతాలు మ‌రిన్ని ఇప్ప‌టిత‌రానికి రాబోయే త‌రానికి తెలియాలి. ఇవ‌న్నీ సాయిప్ర‌కాష్‌గారు సినిమాలో చూపిస్తారని అన్నారు.

సి. క‌ళ్యాణ్ మాట్లాడుతూ… మా గురువుగారు సాయిప్ర‌కాష్‌గారు. ఆయ‌న ద‌గ్గ‌ర నేను అసిస్టెంట్‌గా చేశాను. 50 ఏళ్ళ సినీ జీవితం ఆయ‌న‌ది. 100వ సినిమాగా స్వామివారి సినిమా చేయ‌డం భ‌గ‌వంతుడు ప్ర‌సాదించిన వ‌రంగా భావిస్తున్నా. ఈ సినిమాను బాబాగారి శిష్యుడిగా బాగా తీస్తారు. దీనిని స్వామి భ‌క్తులే కాకుండా ప్ర‌పంచం ఆద‌రించాలి. సాయి సేవాభావంతో చేసిన శాంతి, స‌హాయం అల‌వ‌ర్చుకోవాలి అని తెలిపారు.

సాయికుమార్ మాట్లాడుతూ…  నేను ఇలా నిల‌బ‌డ‌డానికి బాబానే కార‌ణం.నాకు స్వామి పుట్టిన‌రోజుకు పుట్ట‌ప‌ర్తికి శాస్త్రిగారి ద్వారా పిల‌వ‌డం జ‌రిగింది. అప్ప‌టికీ నా పోలీస్ స్టోరీ రాలేదు. పుట్ట‌ప‌ర్తిలో స్వామివారు అంద‌రికీ బ‌ట్ట‌లు  ఇచ్చారు. నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి నీకేం బ‌ట్ట‌లు కావాల‌న్నారు. మీ ఇష్టం అన్నాను. నాకు స‌ఫారీ సూట్ ఇచ్చారు. నీకు ఐఎఎస్‌. ఐ.పి.ఎస్‌. బాగుంటుంది అన్నారు. ఈయ‌నేంటి ఇలా అంటారు. చిన్న చిన్న డ‌బ్బింగ్‌లు చెప్పుకునే నాకు ఆ మాట‌లు అర్థంకాలేదు. అమ్మ‌కు చెప్పాను. పెద్ద‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరుగా వుంటాయ‌ని చెప్పింది. ఓసారి సునీల్ గ‌వాస్క‌ర్‌తో ఓ వ్య‌క్తి వ‌చ్చారు. న‌న్ను చూడ‌గానే హ్యాపీనా! అని అడిగారు. స్వామికి లెట‌ర్ ఇవ్వు అన్ని చెప్పారు. నాకు అర్థంకాలేదు. మా అమ్మ‌ను అడిగితే కోరిక‌లు లెట‌ర్ ద్వారా తెలియ‌జేస్తారు అంది. ఓరోజు స్వామివారు న‌న్ను చూస్తూ లెట‌ర్ రాయ‌లేదే అని క‌ళ్ళ‌తో సైగ చేశారు. అయిష్టంగానే వెంట‌నే ప‌క్క‌న ఓ వ్య‌క్తి ద‌గ్గ‌రున్న పేప‌ర్‌, పెన్నులో ఏదో రాసేశాను. ఆ త‌ర్వాత అవ‌న్నీ జ‌రిగిపోయాయి. అది నాకు మ‌రింత ఆశ్చ‌ర్యం క‌లిగింది.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న బ్ర‌హ్మారెడ్డి, నిర్మాత‌ రాధామోహ‌న్‌, న‌టి శివ‌పార్వ‌తి మాట్లాడుతూ, బాబాగారితో త‌మ‌కున్న అనుభాల‌ను, అద్భుతాల‌ను, భ‌క్తుల‌తో గ‌డిపిన క్ష‌ణాల‌ను గుర్తు చేసుకున్నారు. బాబాపై సినిమా తీయ‌డం చాలా ఆనందంగా వుంద‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా బాగాగారి గురించి భ‌క్తులు త‌న్మ‌యంతో గానం చేయ‌డం విశేషం.