వేలానికి శ్రీదేవి ఫేవరేట్‌ పెయింటింగ్‌

అతిలోక సుందరి శ్రీదేవి అద్భుతమైన నటినే కాదు, కళాకారిణి కూడా. ఖాళీ సమయాల్లో ఆమె పెయింటింగ్‌లు వేస్తుండేవారు. శ్రీదేవి మంచి చిత్రకారిణి అన్న విషయం చాలామందికి తెలియదు. షూటింగ్‌ లేని సమయంలో ఆమె పెయింటింగ్‌ వేసింది. శ్రీదేవి వేసిన ఓ పెయింటింగ్‌ను లండన్‌లోని క్రిస్టీ సంస్థ వేలం వేసింది. ఈ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వెచ్చించారు.

సోనమ్‌ కపూర్‌ నటించిన ‘సావరియా’ చిత్రంలోని ఓ ఫొటో శ్రీదేవికి బాగా నచ్చిందట. దీంతో తన కుంచెతో దాన్ని అందమైన పెయింటింగ్‌గా ఆవిష్కరించారు. అంతేకాదు, పాప్‌స్టార్‌ మైఖేల్‌ జాక్సన్‌తోపాటు ఇతర బొమ్మలను కూడా గీశారు. త్వరలో మైఖేల్‌ జాక్సన్‌ చిత్ర పటాన్ని దుబాయిలో  వేలానికి పెట్టనున్నారు. శ్రీదేవి పెయింటింగ్‌లు చూసి 2010లో దుబాయ్ కి  చెందిన అంతర్జాతీయ ఆర్ట్‌ హౌస్‌ ఆమెను సంప్రదించింది. తన పెయింటింగ్‌లను వేలానికి పెట్టాల్సిందిగా కోరింది. కానీ అందుకు శ్రీదేవి ఒప్పు కోలేదు. వేలంలో వచ్చిన డబ్బును ఓ ఛారిటీకి విరాళంగా ఇస్తామని చెప్పడంతో తన పెయిం టింగ్‌లను వేలానికి పెట్టడానికి ఆమె ఒప్పుకున్నారు. ”మైఖేల్‌ జాక్సన్‌ చిత్రం తన ఫేవరేట్‌ పెయింటింగ్‌” అని శ్రీదేవి తెలిపారట. ఈ చిత్రాన్ని రూ.8లక్షలకు వేలం చేయనున్నారు. ఇదిలా ఉంటే శ్రీదేవిని ఉద్దేశించి అమితాబ్‌ ట్వీట్‌ చేసిన ఓ కవిత ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది