`దేవిశ్రీ ప్ర‌సాద్‌` థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల‌ !

యశ్వంత్ మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో ఆర్‌.ఒ.క్రియేష‌న్స్ బేన‌ర్‌పై రూపొందిన చిత్రం `దేవిశ్రీ ప్ర‌సాద్‌`. పూజా రామ‌చంద్ర‌న్‌, భూపాల్‌రాజు, ధ‌న‌రాజ్‌, మ‌నోజ్ నందం ప్ర‌ధాన పాత్ర‌ధారులు. శ్రీ కిషోర్ ద‌ర్శ‌కుడు. డి.వెంక‌టేష్‌, ఆర్‌.వి.రాజు, ఆక్రోష్ నిర్మాత‌లు. ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోలో జ‌రిగింది.
ఈ సంద‌ర్భంగా…బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ – “`దేవిశ్రీ ప్ర‌సాద్ ట్రైల‌ర్‌, టైటిల్ రెండూ బావున్నాయి. సూప‌ర్ స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ పేరుతో ముగ్గురు పాత్ర‌లు చేసిన సినిమా ఇది. సినిమా కూడా అదే రేంజ్‌లో తీసి ఉంటార‌ని అనుకుంటున్నాను. ఈ సినిమాతో యూనిట్ స‌భ్యులంద‌రికీ మంచి పేరు రావాలి. నిర్మాత‌ల‌కు బాగా ప్రాఫిట్స్ రావాలి. ద‌ర్శ‌కుడికి మంచి పేరు రావాలి“ అన్నారు.
రాజ్ కందుకూరి మాట్లాడుతూ – “సినిమా మంచి థ్రిల్ల‌ర్. ఎంగేజింగ్‌గా ఉంది. సినిమా వ్య‌వ‌థి కూడా త‌క్కువే. భూపాల్‌, మ‌నోజ్ నందం, ధ‌న‌రాజ్‌లు అద్భుతంగా న‌టించారు. పూజా రామచంద్ర‌న్ చ‌క్క‌గా నటించింది. ద‌ర్శ‌కుడు శ్రీ కిషోర్ కొరియోగ్రాఫ‌ర్ సినిమా అంటే ప్యాష‌న్ ఉన్న వ్య‌క్తి. హాంగ్ కాంగ్‌లో ఉంటూ ఇక్క‌డ సినిమాలు తీయాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఈ సినిమాతో ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు మంచి బ్రేక్ రావాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.
న‌వీన్ చంద్ర మాట్లాడుతూ – “భూపాల్‌, ధ‌న‌రాజ్‌, మ‌నోజ్ నందం, పూజా రామ‌చంద్ర‌న్ అంద‌రూ నాకు బాగా తెలిసిన‌వాళ్లే. ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. భూపాల్‌కు ఆల్ ది బెస్ట్‌. ముగ్గురు క్యారెక్ట‌ర్స్ చాలా బాగా డిజైన్ చేశారు. నిర్మాత‌లు క‌థ‌పై న‌మ్మ‌కంతో సినిమా చేసినందుకు వారిని అభినందిస్తున్నాను. ద‌ర్శ‌కుడు శ్రీ కిషోర్ ముప్పై రోజుల్లోపే సినిమాను పూర్తి చేశాడంటే, త‌నెంత ప‌క్కాగా సినిమా చేశాడో అర్థం చేసుకోవ‌చ్చు. టీమ్ ఆల్ ది బెస్ట్‌“ అన్నారు.
భూపాల్ మాట్లాడుతూ – “ సినిమాలో డిఫ‌రెంట్ రోల్ చేశాను. అలాగే ధ‌న‌రాజ్‌, మ‌నోజ్ నందం క్యారెక్ట‌ర్స్ కూడా చాలా కొత్త‌గా ఉంటాయి. సినిమా సెన్సార్ కూడా పూర్త‌య్యింది. త‌ప్ప‌కుండా సినిమా అంద‌రినీ మెప్పించే సినిమా అవుతుంది“ అన్నారు.
మ‌నోజ్ నందం మాట్లాడుతూ – “మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ. సినిమా బాగా వ‌చ్చింది. శ్రీ కిషోర్‌గారు మంచి ద‌ర్శ‌కుడు. ఆయ‌న‌తో పాటు మా అందరికీ ఇది మంచి సినిమా అవుతుంది“ అన్నారు.
ధ‌న‌రాజ్ మాట్లాడుతూ – “`దేవిశ్రీ ప్ర‌సాద్‌`లో భూపాల్‌, మ‌నోజ్‌, ధ‌న‌రాజ్ అనే క్యారెక్ట‌ర్స్‌ను కాకుండా దేవి, శ్రీ, ప్ర‌సాద్ అనే మూడు క్యారెక్ట‌ర్స్‌ను మాత్ర‌మే చూడండి. పాత్ర‌ల్లో ఒదిగిపోయే ప్ర‌య‌త్నం చేశాం. శ్రీ కిషోర్ హాంగ్ కాంగ్ నుండి ఇక్క‌డికి వ‌చ్చి సినిమాలు చేస్తున్నాడు. కాన్సెప్ట్‌ను నమ్మి సినిమా చేయ‌డానికి ముందుకు వ‌చ్చిన నిర్మాత‌ల‌కు థాంక్స్‌. అలాగే డి.వెంక‌టేష్‌గారు సినిమాను విడుద‌ల చేస్తుండ‌టం మంచి ప‌రిణామం. మేం సినిమా చూశాం. రెండు వారాలు సినిమా ఆడితే చాలు. ఇలాంటి చిన్న సినిమాలు ఆడితే మంచి కాన్సెప్ట్ సినిమాలు మ‌రిన్ని వ‌స్తాయి“ అన్నాయి.
నిర్మాత డి.వెంక‌టేష్ మాట్లాడుతూ – “సినిమా చూసిన త‌ర్వాత చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. సినిమా చూసిన తర్వాత నేను ఈ సినిమా నిర్మాణంలో భాగ‌మ‌య్యాను. శ్రీకిషోర్ త‌క్కువ బ‌డ్జెట్‌లోనే సినిమా చేశాడు. రేపు భ‌విష్య‌త్‌లో నేను స్ట్ర‌యిట్ తెలుగు సినిమా చేస్తే శ్రీ కిషోర్ వంటి టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌తోనే చేస్తాను. సినిమాలో ఎలాంటి వ‌ల్గారిటీ క‌న‌ప‌డ‌దు. అంద‌రూ చూసేలా సినిమా ఉంటుంది“ అన్నారు.
శ్రీ కిషోర్ మాట్లాడుతూ – “సినిమా జ‌ర్నీ స్టార్ట్ చేసి ఏడాదిన్న‌ర అయ్యింది. ధ‌న‌రాజ్‌గారికే ముందు లైన్ చెప్పాను. త‌న‌కు లైన్ న‌చ్చ‌గానే, సినిమా చేద్దామ‌ని అన్నాడు. సినిమా నిర్మాత‌ల కోసం చూస్తున్న స‌మ‌యంలో ఫేస్ బుక్ ద్వారా నిర్మాత ఆక్రోష్ ప‌రిచ‌యమై, సినిమా చేద్దామ‌ని అన్నారు. త‌ర్వాత రాజుగారు నిర్మాత‌గా స‌పోర్ట్ ఇచ్చారు. ఇద్ద‌రి స‌హకారంతో సినిమా పూర్తి చేశాను. సెన్సార్ వాళ్లు సినిమా చూశారు. బావుంద‌ని అన్నారు. త‌ప్ప‌కుండా సినిమా డిఫరెంట్‌గా ఉంటుంది.
చిత్ర నిర్మాత‌లు ఆర్‌.వి.రాజు, ఆక్రోష్ మాట్లాడుతూ  – “మా దేవిశ్రీప్ర‌సాద్ చిత్రంలో ప్ర‌తి సన్నివేశంతో ఎంతో ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. ప్ర‌ధానంగా మ‌నోజ్ నంద‌న్‌, భూపాల్‌, ధ‌న‌రాజ్‌, పూజా రామ‌చంద్ర‌న్ చుట్టూ తిరిగే ఈ థ్రిల్ల‌ర్‌లో ప్ర‌తి సీన్ ఎంతో ఎంగేజింగ్‌గా ఉంటుంది. అల్రెడి విడుద‌లైన టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సోష‌ల్ మీడియాలో ఈ టీజ‌ర్‌ను టెన్ మిలియ‌న్ ప్రేక్ష‌కులు వీక్షించారు. ఓ చిన్న సినిమాకు ఇంత ఆద‌ర‌ణ రావ‌డం ఎంతో ఆనందంగా ఉంది. మంచి మెసేజ్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో సినిమా సాగుతుంది.  త్వ‌ర‌లోనే సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాం“ అన్నారు.
పూజా రామ‌చంద్ర‌న్‌, భూపాల్ రాజు, ధ‌న‌రాజ్‌, మ‌నోజ్ నందం, పోసాని కృష్ణ‌ముర‌ళి, వేణు టిల్లు త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సంగీతంః కమ్రాన్‌, కెమెరాః ఫ‌ణీంద్ర వ‌ర్మ అల్లూరి, ఎడిటింగ్ః చంద్ర‌మౌళి.ఎం, మాట‌లుః శేఖ‌ర్ విఖ్యాత్‌, శ్రీ కిషోర్‌, లైన్ ప్రొడ్యూస‌ర్ః చంద్ర వ‌ట్టికూటి, నిర్మాత‌లుః డి.వెంక‌టేష్‌, ఆర్‌.వి.రాజు, ఆక్రోష్, క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః శ్రీ కిషోర్‌.