శ్రీ కిషోర్‌ `దేవిశ్రీ ప్ర‌సాద్‌` 17న విడుద‌ల‌

యశ్వంత్ మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో,  ఆర్ ఓ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న‌ చిత్రం దేవిశ్రీప్రసాద్. పూజా రామచంద్రన్, భూపాల్, ధ‌న‌రాజ్‌, మనోజ్ నందన్ ప్రధాన పాత్రలుగా పోషిస్తున్న ఈ చిత్రానికి శ్రీ కిషోర్ దర్శకుడు. డి.వెంకటేష్, ఆర్‌.వి.రాజు, ఆక్రోష్ నిర్మాత‌లు. ఈ సినిమా నవంబ‌ర్ 17న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్బంగా …
ద‌ర్శ‌క నిర్మాత‌లు మాట్లాడుతూ – “సినిమా అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. ముందుగా సినిమాను న‌వంబ‌ర్ 10న విడుద‌ల చేయాల‌ని అనుకున్న‌ప్ప‌టికీ..కొన్ని అనివార్య కార‌ణాల కార‌ణంగా ఓ వారం పాటు వాయిదా వేశాం. కాబ‌ట్టి సినిమాను న‌వంబ‌ర్ 17న పెద్ద ఎత్తున రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. పూజా రామచంద్రన్, భూపాల్, ధ‌న‌రాజ్‌, మనోజ్ నందన్‌ల న‌ట‌న ఆద్యంతం ఆక‌ట్టుకునే ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. కొత్తదనం కోరుకునే తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుంది“ అన్నారు.
పూజా రామ‌చంద్ర‌న్‌, భూపాల్ రాజు, ధ‌న‌రాజ్‌, మ‌నోజ్ నందం, పోసాని కృష్ణ‌ముర‌ళి, వేణు టిల్లు త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సంగీతంః కమ్రాన్‌, కెమెరాః ఫ‌ణీంద్ర వ‌ర్మ అల్లూరి, ఎడిటింగ్ః చంద్ర‌మౌళి.ఎం, మాట‌లుః శేఖ‌ర్ విఖ్యాత్‌, శ్రీ కిషోర్‌, లైన్ ప్రొడ్యూస‌ర్ః చంద్ర వ‌ట్టికూటి, నిర్మాత‌లుః డి.వెంక‌టేష్‌, ఆర్‌.వి.రాజు, ఆక్రోష్, క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః శ్రీ కిషోర్‌.