యశ్వంత్ మూవీస్ సగర్వంగా సమర్పిస్తున్న చిత్రం `దేవిశ్రీప్రసాద్`. ఆర్ ఓ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న చిత్రంలో పూజా రామచంద్రన్, భూపాల్, ధనరాజ్, మనోజ్ నందన్ ప్రధాన పాత్రలుగా పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీ కిషోర్ దర్శకుడు. డి.వెంకటేష్, ఆర్.వి.రాజు, ఆక్రోష్ నిర్మాతలు. భారత దేశంలోనే మొట్టమొదటి సారిగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం.. అంతే కాదు ఈ చిత్ర నిర్మాత డి. వెంకటేష్ ఓ సవాల్ ను కూడా విసిరారు ఇంతకు ముందు ఎన్నడైనా భారత దేశంలో ఇటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చిందని నిరూపించిన వారికి 5 లక్షలు ప్రైజ్ మనీ ఇస్తామంటూ ప్రకటించడం మరో విశేషం. మునుపెన్నడూ లేని విధంగా ఈ చిత్ర కథను మలచడం దర్శకుడి తెలివి తేటలకు నిదర్శనం అయితే ఇలాంటి చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాతలు మంచి అభిరుచి గల వ్యక్తులుగా పరిగణలోకి తీసుకోవాలి.
ఇప్పటికే ఈ సినిమా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని నవంబర్ 17న విడుదల కావాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల కారణంగా ఓ వారం పాటు వాయిదా వేయడం జరిగిందని అంటున్నారు ఈ చిత్ర యూనిట్. కాబట్టి సినిమాను నవంబర్ 24 న పెద్ద ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు, తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 200 థియేటర్లలో విడుదల కానుంది అని దేవి శ్రీ ప్రసాద్ నిర్మాతలు తెలిపారు. పూజా రామచంద్రన్, భూపాల్, ధనరాజ్, మనోజ్ నందన్‌ల నటన ఆద్యంతం ఆకట్టుకునే ఆసక్తికరంగా సాగుతుంది. కొత్తదనం కోరుకునే తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుంద నే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రివ్యూ చూసిన వారు.
పూజా రామచంద్రన్, భూపాల్ రాజు, ధనరాజ్, మనోజ్ నందం, పోసాని కృష్ణమురళి, వేణు టిల్లు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతంః కమ్రాన్, కెమెరాః ఫణీంద్ర వర్మ అల్లూరి, ఎడిటింగ్ః చంద్రమౌళి.ఎం, మాటలుః శేఖర్ విఖ్యాత్, శ్రీ కిషోర్, లైన్ ప్రొడ్యూసర్ః చంద్ర వట్టికూటి, నిర్మాతలుః డి.వెంకటేష్, ఆర్.వి.రాజు, ఆక్రోష్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంః శ్రీ కిషోర్.