ఇప్పుడప్పుడే వెనక్కి వెళ్ళడం కుదరదేమో !

శ్రీనిధి శెట్టి… “నేను నటిగా సక్సెస్‌ అయితే కొనసాగుతాను, లేకపోతే రెండు మూడు సినిమాలు చేసి వెనక్కి వచ్చేస్తాను అని మా పేరెంట్స్‌ కి నచ్చచెప్పాను.అయితే, ఇప్పుడప్పుడే వెనక్కి వెళ్ళడం కుదరదేమో”….అని అంటోంది తొలి కన్నడ చిత్రం ‘కె.జి.ఫ్’ తోనే నాయికగా ఘనవిజయాన్ని సాధించిన శ్రీనిధి శెట్టి. ప్రస్తుతం దక్షిణాది సినిమాలకు ‘హాట్ ఛాయిస్’ గా మారిన ఆమె తన చిత్ర రంగ అనుభవాలు…

“ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ చదివా. బ్యాడ్మింటన్‌ బాగా ఆడతాను. కొన్ని పోటీల్లో కూడా పాల్గొన్నాను.నటన అంటే చాలా ఇష్టం. చదువుకునే రోజుల్లో ఒక్కసారన్నా బుల్లితెర మీద కనిపించాలని అనుకునేదాన్ని.చదువుకునే రోజుల్లో అనేక అందాల పోటీల్లో పాల్గొన్నాను. ఆ పోటీల్లో నన్ను చూసిన ‘కె.జి.ఫ్’ సినిమా యూనిట్‌ నన్ను హీరోయిన్‌గా సెలెక్ట్‌ చేసింది.కథ వినగానే మంచి సినిమా చేస్తున్నానన్న నమ్మకం కుదిరింది.ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ‘కెజిఎఫ్‌’ హీరోయిన్‌గా అందరూ నన్ను గుర్తు పడుతున్నారు. ఈ గుర్తింపును బాగా ఎంజాయ్‌ చేస్తున్నాను.
 
డబ్బింగ్‌ మూవీనే అయినా ‘కెజిఎఫ్‌’ను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఈ సినిమా విడుదల తరువాత చాలా మంది కథలు చెబుతామంటూ వచ్చారు. కొన్ని కథలు విన్నాను. కానీ ఎవరికీ ఓకే చెప్పలేదు. ఈ సినిమా చేస్తున్న సమయంలోనే శాండల్‌వుడ్‌లో కూడా రెండు సినిమాలకు ఓకే చెప్పాను. వాటికి ఇబ్బంది రాకుండా డేట్లు చూసుకుని తెలుగులో ఓకే చెబుతాను. ఒక్క తెలుగనే కాదు, తమిళం నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి.తెలుగు, కన్నడం దగ్గరదగ్గరగా ఉంటాయి. కనుక భాష తేలికగానే అర్ధమవుతోంది. తమిళమే కొద్దిగా కష్టమనిపిస్తోంది. సినిమాలు ఒప్పుకోగానే భాషలు నేర్చుకునే ప్రయత్నం చేస్తాను”