శ్రీనివాస్ రెడ్డి ‘రాగల 24 గంటల్లో’ పెద్ద హిట్ అవ్వాలి!

‘ఢమరుకం’ ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో సత్యదేవ్, ఈషా రెబ్బ, శ్రీరాం, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య పాత్రదారులుగా నటించిన చిత్రం “రాగల 24 గంటల్లో”. శ్రీ నవహాస్ క్రియేషన్స్,
శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ బానర్స్ పై శ్రీనివాస్ కానూరు ఈ చిత్రాన్ని నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం నవంబరులో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఇప్పటికే విడుదలైన టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం ప్రమోషనల్ సాంగ్ ‘రాక్ స్టార్’ దేవిశ్రీ ప్రసాద్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు రఘు కుంచె, పాటల రచయిత శ్రీమణి, మాటల రచయిత కృష్ణభగవాన్, నటుడు రవి వర్మ, కెమెరామెన్ అంజి, లైన్ ప్రొడ్యూసర్ యమ్ యస్ కుమార్, చిత్ర నిర్మాత శ్రీనివాస్ కానూరు, దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
 
‘రాక్ స్టార్’ దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఢమరుకం’ సినిమానుండి శ్రీనివాస్ రెడ్డి గారితో మంచి బాండింగ్ ఏర్పడింది. అప్పటినుంచి ఆయన మా ఫ్యామిలీ లో ఒక మెంబర్ అయిపోయారు. మంచితనానికి మారుపేరు ఆయన. ఈ ప్రమోషనల్ సాంగ్ నేను రిలీజ్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. టీజర్, ట్రయిలర్ చూశాను.. చాలా చాలా బాగుంది. నిర్మాత శ్రీనివాస్ కానూరు గారు మంచి ఫ్యాషన్ ఉన్న నిర్మాత. అలాగే డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఈ సినిమా పెద్ద బ్రేక్ అవుతుంది.. అన్నారు.
 
దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రమోషనల్ సాంగ్ చేయడానికి ఇన్స్పిరేషన్ దేవిశ్రీప్రసాద్. రఘు కుంచె చాలా ట్రెండీగా ఈ పాటని కంపోజ్ చేశారు. కృష్ణభగవాన్ స్క్రిప్ట్ నచ్చి మనసు పెట్టి మంచి డైలాగ్స్ రాశారు. అందరూ గర్వపడే విధంగా సినిమా చేశాను. కెమెరా, మ్యూజిక్ ఈ సినిమాకి రెండు కళ్ళు. అంజి బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చాడు. రఘు అద్భుతమైన పాటలు, రీ-రికార్డింగ్ చేశాడు. మా నిర్మాత శ్రీనివాస్ కానూరు మంచి అభిరుచిగల నిర్మాత. ఈ చిత్రాన్ని ఆదరించి సక్సెస్ చెయ్యాలని కోరుకుంటున్నాను.. అన్నారు.
 
నిర్మాత శ్రీనివాస్ కానూరు మాట్లాడుతూ.. బేసిగ్గా నాది ట్రావెల్ బిజినెస్. నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం.శ్రీనివాస్ రెడ్డి మంచి స్నేహితుడు. నా మొదటి సినిమా శ్రీనివాస్ రెడ్డి లాంటి మంచి డైరెక్టర్ తో నిర్మించడం నా అదృష్టం. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది.. అన్నారు.
 
మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె మాట్లాడుతూ.. సంగీత సామ్రాజ్యంలో మకుటం లేని మహారాజు దేవిశ్రీప్రసాద్ మా ప్రమోషనల్ సాంగ్ లాంచ్ చేయడంతో మా సినిమా పెద్ద విజయంసాధించినట్లే . ఈ చిత్రంలో మూడు డిఫరెంట్ సాంగ్స్ ఉన్నాయి. ప్రతీ పాట చాలా కేర్ తీసుకొని చేశాం. ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ రెడ్డిగారికి నా థాంక్స్ ..అన్నారు.
 
ఈ చిత్రానికి కథ: వై.శ్రీనివాస్ వర్మ, మాటలు: కృష్ణభగవాన్, సంగీతం: రఘు కుంచె, పాటల రచయితలు: భాస్కరభట్ల, శ్రీమణి, డిఓపి: గరుడవేగ అంజి, ఆర్ట్: చిన్నా, ఎడిటర్: తమ్మిరాజు, ఫైట్స్: విక్కీ, డాన్స్: స్వర్ణ, భాను, లైన్ ప్రొడ్యూసర్: యం. ఎస్. కుమార్, ప్రొడ్యూసర్: శ్రీనివాస్ కానూరు, స్క్రీన్ ప్లే-డైరెక్షన్: శ్రీనివాస్ రెడ్డి