కొరటాల శివ అంత తీసుకుంటున్నాడు !

ఎన్టీయార్‌, మహేష్‌లతో ఇప్పటికే ఒక్కో సినిమా చేసిన శివ.. మరోసారి వారితో జత కట్టనున్నాడు.టాప్‌ స్టార్స్‌తో వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతున్నాడు రచన నుంచి దర్శకత్వం వైపు మళ్లిన కొరటాల శివ.  తాజాగా మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. ఈ సినిమాకు కొరటాల శివ తీసుకుంటున్న పారితోషికం ఎంతో తెలుసా? అక్షరాల 14 కోట్ల రూపాయలట. ఆ మేరకు ఇప్పటికే అడ్వాన్స్‌ కూడా తీసేసుకున్నాడట. మరి, డైరెక్టరే ఇంత తీసుకుంటే చెర్రీ ఎంత తీసుకుంటాడో అని ఆలోచిస్తున్నారా? ఈ సినిమా వరకు చెర్రీ రెమ్యునరేషన్‌ గురించి ఆలోచించనవసరం లేదు. ఎందుకంటే ఈ సినిమాకు చెర్రీయే నిర్మాత. ‘క్షణం’, ‘ఘాజీ’ వంటి సినిమాలు తీసిన ‘మ్యాట్నీ సినిమా ఎంటర్‌టైన్‌మెంట్స్‌’తో కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాడు చరణ్‌. ప్రస్తుతం సుకుమార్‌ డైరెక్షన్‌లో చేస్తున్న ‘రంగస్థలం 1985’ తర్వాత రామ్‌చరణ్‌ ఈ సినిమాను పట్టాలెక్కిస్తాడట.