అక్కడా ఇక్కడా రాణిస్తానంటున్నాడు !

సినిమా రంగంలో సంపాదించిన సొమ్ము మళ్లీ అదే రంగంలో పెట్టుబడిగా పెట్టేవారు పూర్వం. అయితే  ట్రెండ్ మారింది. కొత్త  హీరోలు రోజుకో కొత్త ఆలోచన చేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. కేవలం నటులుగానే కాకుండా బిజినెస్ లోనూ  ప్రవేశిస్తున్నారు.  ఈదారిలో  ఇప్పటికే టాలీవుడ్‌లో ఎంతోమంది యువ హీరోలు నడుస్తుండగా … తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా సరికొత్త బిజినెస్‌లతో దూసుకుపోతున్నాడు.
 తండ్రి నుంచి వ్యాపార రంగంలో ఎన్నో మెలకువలు నేర్చుకున్న బన్నీ మొదట రెస్టారెంట్ బిజినెస్  ప్రారంభించాడు . ‘800 జూబ్లీ’ పేరుతో ఇప్పటికే తన ఆధ్వర్యంలో ఓ పబ్‌ను నడుపుతున్నాడు ఈ స్టైలిష్ స్టార్. ఆ తర్వాత ‘కానోలీ కేఫ్’ అంటూ ఓ స్విస్ బేకరీ కూడా మొదలుపెట్టాడు. తాజాగా వరల్డ్ ఫేమస్ స్పోర్ట్స్ బార్ బఫెల్లో వైల్డ్ వింగ్స్ `బి-డబ్స్`కి ఫ్రాంచైజీని స్టార్ట్ చేశాడు అల్లు అర్జున్. ఇక ఇండియాలో ఈ సంస్థకు ఇదే తొలి ఫ్రాంఛైజీ అట.హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో బన్నీ..ఈ ‘బి-డబ్స్’ను ఏర్పాటు చేశాడు. అలాగే స్పోర్ట్స్ టీమ్ లు కొనుగోలు కూడా చేస్తున్నాడు
ఇకముందు కూడా కేవలం సినిమారంగంలోనే కాకుండా మరిన్ని రంగాల్లో తన పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాడట ఈ స్టైలిష్ స్టార్. మరోవైపు సేమ్ ఫ్యామిలీలో ఉన్న చెర్రీ ఇప్పటికే ఎయిర్ లైన్ బిజినెస్‌లో ఉన్నాడు. మొత్తానికి నేటితరం హీరోలు కాస్మోపోలిటన్ కామర్స్ వైపు మొగ్గుచూపుతూ తమ బిజినెస్‌ స్టైల్‌ను చాటుకుంటున్నారు