జాతీయ ‘బాలశ్రీ’ పోటీలకు ఎంపికైన శుభాన్విత

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇప్పటికే ‘బాలరత్న’ అవార్డును అందుకున్న చిరంజీవి ఎస్. శుభాన్విత జాతీయ స్థాయిలో ‘బాలశ్రీ’ అవార్డు కోసం ఏప్రిల్ 21 నుండీ 24 వరకూ న్యూ ఢిల్లీలో జరిగే పోటీలలో ‘సృజనాత్మక నృత్య విభాగం’ కు ఎంపికైంది. ‘ఉత్తర సెంటర్ ఫర్ ఫెర్మార్మింగ్ ఆర్ట్స్’ వ్యవస్థాపకురాలు, శుభాన్విత గురువు శ్రీమతి గీతా గణేశన్ ఈ విషయాన్ని తెలిపారు…

హైదరాబాద్ కు చెందిన సోమేసుల బాలసుబ్రహ్మణ్యం, సుహాసిని దంపతుల కుమార్తె శుభాన్విత ప్రస్తుతం శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ చదువుతోంది. చదువులో ప్రతిభను కనబరుస్తూనే దేశ వ్యాప్తంగా 300 ప్రదర్శనలు ఇచ్చి, అనేక అవార్డులను అందుకుంది. 2014లో భారత ప్రభుత్వం సి.సి.ఆర్.టి. స్కాలర్ షిప్ కు ఎంపికైంది. దూరదర్శన్ నిర్వహించిన ‘అందెల రవళి’ పోటీలో భరతనాట్యం, కూచిపూడిలో ప్రధమ బహుమతి పొందింది. 2015లో రాష్ట్ర స్థాయి యువజనోత్సవాల్లో ప్రధమ స్ధానం పొంది, చత్తీస్ ఘడ్ లో జాతీయ స్థాయిలో జరిగిన పోటీలలో తెలంగాణాకు ప్రాతినిధ్యం వహించింది. అనేక జాతీయ స్థాయి నృత్య పోటీలలో ప్రధమ బహుమతి పొంది, న్యాయనిర్ణేతల ప్రశంసలు అందుకుంది. జాతీయ స్థాయి బాలశ్రీ పోటీలకు ఎంపిక చేసిన న్యాయనిర్ణేతలకు, తనకు శిక్షణ  ఇచ్చిన గురువులకు శుభాన్విత ధన్యవాదాలు తెలిపింది.