సుజాత బౌర్య కామెడీ హర్రర్ ‘జబ్బర్ధస్త్ గబ్బర్ సింగ్’

`పంచ‌మి` చిత్రంతో తొలి హిట్ అందుకున్న ఐడియా మూవీ క్రియేష‌న్స్ తాజాగా నిర్మిస్తోన్న చిత్రం  `జ‌బ్బ‌ర్థ‌స్త్ గ‌బ్బ‌ర్ సింగ్`. హ‌ర్ష హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. `స్వాతి చినుకులు`  ఫేం  ప్రియాంక నాయుడు, క‌న్న‌డ చిత్రాల్లో హీరోయిన్ గా న‌టించిన అతిధి రాయ్ హీరోయిన్ల‌గా న‌టిస్తున్నారు. సుజాతా బౌరియా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. న‌రేంద‌ర్ గౌడ్, హ‌బీబీబ్ పాషా నిర్మిస్తున్నారు. శ్రీకోటి సంగీతం అందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా సెట్స్ లో ఉంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌క నిర్మాత‌లు సినిమా అప్ డేట్ ను తెలిపారు.
చిత్ర ద‌ర్శ‌కురాలు సుజాతా బౌర్య మాట్లాడుతూ,` నా తొలి సినిమా ఇదే బ్యాన‌ర్ లో తెర‌కెక్కించి హిట్ అందుకున్నాను. ద‌ర్శ‌కురాలిగా నాకు ఆ చిత్రంతో మంచి పేరు వ‌చ్చింది. రెండ‌వ ప్ర‌య‌త్నంగా ‘జ‌బ్బ‌ర్థ్ ద‌స్త్ గ‌బ్బ‌ర్ సింగ్’ సినిమాను కామెడీ హార‌ర్ నేప‌థ్యంతో తెర‌కెక్కిస్తున్నాను. ఇప్ప‌టికే 75 శాతం చిత్రీక‌ర‌ణ  క‌డ‌ప, క‌ర్నూల్ ప్రాంతాల్లో పూర్తిచేసాం. మంచి అవుట్ ఫుట్ వ‌చ్చింది. న‌టీన‌టులంతా చ‌క్క‌గా న‌టిస్తున్నారు. నిర్మాత‌లు బడ్జెట్ విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా స‌హ‌క‌రిస్తున్నారు. అందువ‌ల్లే సినిమా నేను అనుకున్న విధంగా చేయ‌గల్గుతున్నా. ప్ర‌స్తుతం చివ‌రి షెడ్యూల్ జ‌రుగుతోంది. మిగ‌తా ప‌నులు పూర్తిచేసి వీలైనంత త్వ‌ర‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తాం` అని అన్నారు.
చిత్ర నిర్మాత న‌రేంద‌ర్ గౌడ్ మాట్లాడుతూ,` కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ సినిమా ఇది. కామెడీ స‌న్నివేశాలు క‌డుపుబ్బా న‌వ్విస్తాయి. హార‌ర్ స‌న్నివేశాలు కొత్త అనుభూతినిస్తాయి. సుజాత గారు సినిమా త‌న‌దైన శైలిలో తెరకెక్కిస్తున్నారు. సంగీత ద‌ర్శ‌కుడు కోటి మంచి స్వ‌రాలు స‌మ‌కూర్చారు. అన్ని పాట‌లు హైలైట్ గా ఉంటాయి. ప్ర‌స్తుతం షూటింగ్ హైద‌రాబాద్ లో జ‌రుగుతుంది. త్వ‌ర‌లోనే సినిమా రిలీజ్ చేస్తాం. తెలుగు ప్రేక్ష‌కులంతా మా చిత్రాన్ని ఆదరిస్తార‌ని కోరుకుంటున్నా` అని అన్నారు.
సంగీత ద‌ర్శ‌కుడు శ్రీ కోటి మాట్లాడుతూ, `ఇప్ప‌టివ‌ర‌కూ 14 సినిమాల‌కు సంగీతం అందిచాను. అన్ని చిత్రాలు సంగీత ద‌ర్శ‌కుడిగా నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.  `పంచ‌మి` త‌ర్వాత మ‌ళ్లీ మూడు సంవ‌త్స‌రాల గ్యాప్ అనంత‌రం ఓ కొత్త కాన్సెప్ట్ తో మీ ముందుకు వ‌స్తున్నాం. హార‌ర్ కామెడీలో  కొత్త‌ద‌న్నాన్ని ప‌రిచ‌యం చేయ‌బోతున్నాం. పాట‌ల‌న్నీ బాగా వ‌చ్చాయి. ఇందులో ప‌వ‌న్ క‌ల్యాణ్ గారి ఓ పాట‌ను రిమిక్స్ చేస్తున్నాం. మెగా ప్రేక్ష‌కాభిమానుల‌ను ఆ సాంగ్ విప‌రీతంగా ఆకట్టుకుంటుంది. వీలైనంత త‌ర్వ‌గా షూటింగ్..మిగ‌తా ప‌నులు పూర్తిచేసి సినిమా రిలీజ్ చేస్తాం` అని అన్నారు.
ఇత‌ర పాత్ర‌ల్లో పోసాని కృష్ణ ముర‌ళి, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్, త‌నికెళ్ల భ‌ర‌ణి, గౌతం రాజు, తాగుబోతు ర‌మ‌ష్, నాగ‌బాబు, చ‌మ్మ‌క్ చంద్ర‌, న‌రేష్, అశోక్ కుమార్, గుండు సుద‌ర్శ‌న్, గ‌బ్బ‌ర్ సింగ్ గ్యాంగ్, ఖాద‌ర్ గోరీ శాంతి మ‌హారాజ్,  స‌జాయ్, చిత్రం శ్రీను, పూల‌రంగ‌డు బాలు,ఎగ్బాల్ న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి పాట‌లు:  కాస‌ర్ల శ్యామ్, మిట్ట‌ప‌ల్లి సురేంద‌ర్, మ‌ధు ప‌ల‌, కెమెరా: ర‌ఘు బార్లారి, ఎడిటింగ్: మ‌ల్లి, పీఆర్ఓ: శ‌్రీధ‌ర్